Bomb Threat In Civil Court: సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు
ABN , Publish Date - Jul 08 , 2025 | 12:48 PM
హైదరాబాద్ పాతబస్తీలోని సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. డాగ్, బాంబు స్క్వాడ్లతో తనిఖీలు చేపట్టారు.
Bomb Threat In Civil Court: హైదరాబాద్ పాతబస్తీలోని సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి సిటీ సివిల్ కోర్టులో బాంబు పెట్టినట్లు బెదిరించాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు కోర్టు కార్యకలాపాలను నిలిపివేశారు. కోర్టు సిబ్బందిని బయటకు పంపించారు. చీఫ్ మెజిస్ట్రేట్ కోర్టు మూసివేసి డాగ్, బాంబు స్క్వాడ్లతో పోలీసులు తనిఖీలు చేపట్టారు.