కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్
ABN , Publish Date - Apr 18 , 2025 | 04:29 AM
దేశాన్ని అనేక సంవత్సరాలపాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ అవినీతి, అక్రమాలకు పాల్పడి స్కాంగ్రె్‌సగా రూపుచెందిందని భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) ఆరోపించింది.
నేషనల్ హెరాల్డ్ కేసుపై గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసనకు బీజేవైఎం యత్నం
అడ్డుకున్న పోలీసులు.. యువమోర్చా నాయకుల అరెస్టు
కవాడిగూడ, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): దేశాన్ని అనేక సంవత్సరాలపాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ అవినీతి, అక్రమాలకు పాల్పడి స్కాంగ్రె్‌సగా రూపుచెందిందని భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) ఆరోపించింది. నేషనల్ హెరాల్డ్ కేసుపై గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా గురువారం బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు ఖైదీ దుస్తులు ధరించి, సోనియా, రాహుల్, రాబర్ట్ వాద్రా, ప్రియాంక ఫొటోలు మెడలో వేసుకొని, హైదరాబాద్ లోయర్‌ట్యాంక్‌బండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపేందుకు ర్యాలీగా వచ్చారు. అయితే నిరసనకు అనుమతి లేదంటూ వారిని పోలీసులు అడ్డుకున్నారు.
దాంతో బీజేవైఎం నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగగా.. పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా కొంతమంది బీజేవైఎం నాయకులు కార్యకర్తలు పోలీసుల నుంచి తప్పించుకొని రోడ్డుపై బైఠాయించడంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయింది. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి చిత్తశుద్ధి ఉంటే నిజాయితీపరులుగా నిరూపించుకోవాలికాని కార్యకర్తలతో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం దారుణమని అన్నారు.