రాహుల్.. ఇల్లీగల్లీ కన్వర్టెడ్ ‘గాంధీ’
ABN , Publish Date - Feb 18 , 2025 | 05:01 AM
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఇల్లీగల్లీ కన్వర్టెడ్ ‘గాంధీ’ అని మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు. ‘ఇందిర భర్త ఫిరోజ్‌ఖాన్.. వారి కుమారుడు రాజీవ్.. రాజీవ్ తన
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఇల్లీగల్లీ కన్వర్టెడ్ ‘గాంధీ’ అని మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు. ‘ఇందిర భర్త ఫిరోజ్‌ఖాన్.. వారి కుమారుడు రాజీవ్.. రాజీవ్ తన పేరును రాజీవ్ ఖాన్ అని పెట్టుకోవాలి.. కానీ ‘గాంధీ’ అనే తోక తగలించుకున్నరు.. రాహుల్ అసలు పేరు రాహుల్ ఖాన్.. కానీ గాంధీ పేరు వినియోగిస్తున్నరు’ అని బూర విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ కులంపై సీఎం రేవం త్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లోని గాండ్ల కులమే ప్రధాని మోదీ ‘తెలి’ కులం అని తెలిపారు. తెలంగాణలో రెడ్డి కులస్థులు ‘రెడ్డి గాండ్ల’ అని బీసీ సర్టిఫికెట్లు తీసుకుంటున్నారని, ఇలాంటి ఘటనలు చూస్తే, మోదీ కులం, నా కులం ఒకటే అని భవిష్యత్తు లో రేవంత్ ప్రకటించినా ఆశ్చర్యంలేదన్నారు. మోదీని విమర్శించిన అర వింద్ కేజ్రీవాల్, మణిశంకర్ అయ్యర్ వంటివారికి ఎలాంటి గతి పట్టిందో గుర్తు పెట్టుకోవాలని ఆయన రేవంత్‌కు హితవు పలికారు.
బ్రాహ్మణుడి లక్షణం ఒక్కటైనా రాహుల్‌కు ఉందా?: ఎన్వీ సుభాష్
బ్రాహ్మణుడికి ఉండే లక్షణాల్లో ఒక్కటైనా మీ పార్టీ నేత రాహుల్ గాంధీకి ఉందా? అని కాంగ్రెస్ నేతలను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్.వి.సుభాష్ ప్రశ్నించారు. సోమవారం సుభాష్ మీడియాతో మాట్లాడు తూ రాహుల్ అసలు హిందువే కాదని, ముస్లిం సంతతికి చెందిన వారు ముస్లిం కాకపోతే హిందువు అవుతారా? అని నిలదీశారు.