రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం
ABN , Publish Date - Mar 07 , 2025 | 12:10 AM
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ సీనియర్ నాయకులు కనపర్తి సత్యప్రసాద్, బంటు సైదులు అన్నారు.

మిర్యాలగూడ టౌన్, మార్చి 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ సీనియర్ నాయకులు కనపర్తి సత్యప్రసాద్, బంటు సైదులు అన్నారు. పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలు కైవసం చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పార్టీ ఆధ్వర్యంలో బస్టాండ్ ఎదుట స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల పట్ల అన్నివర్గాల ప్రజలు విముఖత చూపుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇండస్ట్రియల్ సెల్ జిల్లా కన్వీనర్ తల్లం అశోక్, ఎడ్ల రమేష్, వెంకటరమణ, బొట్టు సైదులు, పోరెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్యనారాయణ, శేఖర్, రవికుమార్, గిరి తదితరులు పాల్గొన్నారు.
చింతపల్లి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో బీజేపీ నాయకులు మండల కేంద్రంలో గురువారం సంబరాలు నిర్వహించారు. సాగర్-హైదరాబాద్‌పై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సముద్రాల నగేష్, నాయకులు కుక్కడపు రామకృష్ణ, ధరణిపతి రమాణరావు, వెన్నం శేఖర్, బొడ్డు మహేష్‌గౌడ్, కుందేళ్ల చెన్నయ్య, నాల శివకుమార్, గజ్జె అభినవ్, తదితరులు పాల్గొన్నారు.