రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ
ABN , Publish Date - Mar 07 , 2025 | 12:01 AM
రా ష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్ని కల్లో రెండింటిని సొంతం చేసుకోవడంతో పార్టీ బ లాన్ని మరోసారి స్పష్టంగా చాటిందని బీజేపీ పట్టణ అధ్యక్షుడు గండు శ్రీ నివాస్‌గౌడ్ అన్నారు.

- పార్టీ పట్టణ అధ్యక్షుడు గండు శ్రీనివాస్‌గౌడ్
అచ్చంపేటటౌన్, మా ర్చి 6 (ఆంధ్రజ్యోతి) : రా ష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్ని కల్లో రెండింటిని సొంతం చేసుకోవడంతో పార్టీ బ లాన్ని మరోసారి స్పష్టంగా చాటిందని బీజేపీ పట్టణ అధ్యక్షుడు గండు శ్రీ నివాస్‌గౌడ్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎమ్మె ల్సీ స్థానాలలో గెలుపొందినందుకు గురువారం ప ట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి, ఇదే సెగ్మెంట్ నుంచి టీచర్ ఎమ్మె ల్సీగా మల్క కొమరయ్య గెలుపొందడంతో రా ష్ట్రంలో బీజేపీ పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియ ర్ నాయకులు శ్రీనునాయక్, రేణయ్య, రామ చంద్రయ్య, భీమయ్య, గోలి రేణయ్య, పత్యనా యక్, శివచంద్ర, చందులాల్, తేజస్విని, మహే శ్వరి, మధుభూపాని, భయ్యరాజు, చైతన్యచారి, అఖిల్‌రెడ్డి పాల్గొన్నారు.
ఫ ఊర్కొండ : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్ని కల్లో బీజేపీ అభ్యర్థి గెలుపొందడంతో ఊర్కొం డలో బీజేపీ మండల అధ్యక్షుడు రాజేందర్‌గౌడ్ ఆధ్వర్యంలో గురువారం ఆ పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు ఆంజనేయులు, పరశురాములు, లక్ష్మారెడ్డి, శివ ఉన్నారు.
ఫ కల్వకుర్తి : ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థా నాలు బీజేపీ గెలవడంపై కల్వకుర్తిలో జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారిబీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహిం చారు. బస్టాండ్ ఆవరణలో బీజేపీ నాయకులు బాణసంచా పేల్చి, స్వీట్లు పంచుకు న్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మొగిలి దుర్గాప్రసాద్, కృష్ణగౌడ్, రాఘవేందర్ గౌడ్, శేఖర్‌రెడ్డి, రాంభూపాల్‌రెడ్డి, రవి, బాబీదేవ్, నరేష్ తదితరులు ఉన్నారు.
ఫ కందనూలు : ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలు బీజేపీ గెలవడంపై నాగర్‌కర్నూల్‌లో బీజేపీ, తపస్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచి పెట్టుకున్నారు. కార్యక్రమం లో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి దొడ్ల రాజావర్ధన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు రాము, జిల్లా అధికార ప్రతినిధి శ్రీశైలం, నాయకులు నారాయణచారి, రాము, ప్రమోద్‌కుమార్, చందు, యాదగిరిరా వు, ఇందిర, లక్ష్మీ, బాలమణి, సత్యనారాయణ, పెద్దబాబు, సుధాకర్, రాజేశ్వర్‌రెడ్డి, బాలరాజు, తపస్ జిల్లా అధ్యక్షుడు రాజీరెడ్డి పాల్గొన్నారు.