Share News

BJP: ఎరువుల కొరత సృష్టిస్తున్న కాంగ్రెస్‌

ABN , Publish Date - Jul 28 , 2025 | 03:26 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎరువుల కొరతను సృష్టిస్తోంది. మంత్రుల అండతో నాయకులు బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారు.

BJP: ఎరువుల కొరత సృష్టిస్తున్న కాంగ్రెస్‌

  • మంత్రుల అండతో బ్లాక్‌కు తరలిస్తున్న నాయకులు : రాంచందర్‌రావు

గద్వాల, జూలై 27 (ఆంధ్రజ్యోతి): ‘కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎరువుల కొరతను సృష్టిస్తోంది. మంత్రుల అండతో నాయకులు బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 9 లక్షల టన్నుల యూరియా అడిగితే కేంద్రం 12 లక్షల టన్నులకుపైగా కేటాయించింది. అయినా రైతులు ఎందుకు ఎరువుల దుకాణాల ముందు బారులు తీరుతున్నారు. ఎరువుల కొరతపై వ్యవసాయ శాఖ మంత్రి జిల్లా ఖమ్మంలోనే చర్చించేందుకు సిద్ధం’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సవాల్‌ చేశారు.


ఆదివారం జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో పర్యటించిన ఆయన.. కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడారు. రైతులకు సాగు నీరు, పెట్టుబడి సహాయం, ఎరువులను అందించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రధాని మోదీ హయాంలో రైతులకు అవసరమైనన్ని ఎరువులు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని ఎరువుల కొరత తెలంగాణలోనే ఎందుకు ఉందని ప్రభుత్వాన్ని నిలదీశారు. నాగర్‌కర్నూల్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఉయ్యాలవాడ గురుకుల పాఠశాల విద్యార్థినులను రాంచందర్‌రావు పరామర్శించారు. ఆయన వెంట ఎంపీ డీకే అరుణ ఉన్నారు.

Updated Date - Jul 28 , 2025 | 03:26 AM