Share News

మెరుగైన వైద్య సేవలు అందించాలి

ABN , Publish Date - Feb 06 , 2025 | 10:20 PM

ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యసేవలు అందిచాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీని ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వార్డులు, ల్యాబ్‌, ఫార్మసీలను పరిశీలించారు. ఖాళీ పోస్టులు, సిబ్బంది గూర్చి ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది విధుల పట్ల బాద్యతాయు తం గా వ్యవహరించాలని సూచించారు. అవసరమైన మందులను నిల్వ ఉంచుకోవాలన్నారు.

మెరుగైన వైద్య సేవలు అందించాలి
వైద్య సిబ్బందితో మాట్లాడుతున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

నెన్నెల, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యసేవలు అందిచాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీని ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వార్డులు, ల్యాబ్‌, ఫార్మసీలను పరిశీలించారు. ఖాళీ పోస్టులు, సిబ్బంది గూర్చి ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది విధుల పట్ల బాద్యతాయు తం గా వ్యవహరించాలని సూచించారు. అవసరమైన మందులను నిల్వ ఉంచుకోవాలన్నారు. అనంతరం నెన్నెల, ఘన్‌పూర్‌, జోగా పూర్‌ ప్రాథమిక పాఠశాలల్లో ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో చేపడు తున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. మార్చిలోగా పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రతి పాఠశాలలో, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, కిచెన్‌ షెడ్లు, ప్రహారి ఉండేలా చూడాలన్నారు. పూర్తి చేసిన పనులను రికార్డు చేసి వెంటనే బిల్లులు చెల్లించాలన్నారు. అవసరమైన చోట పనుల కోసం ప్రతి పాదనలు పంపిస్తే వెంటనే నిధులు మంజూరు చేస్తామన్నారు. పాఠశాలల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేప ట్టాలన్నారు. అన్ని విధాల సౌకర్యాలు కల్పించి ప్రభుత్వ పాఠశాలల్లో విధ్యార్థుల సంఖ్య పెంచేందుకు టీచర్లు కృషి చేయాల న్నారు. నాన్యమైన విధ్య అందిస్తే విధ్యార్థులు తప్పకుండా వస్తారని పేర్కొన్నారు. ప్రతి నెల పేరెంట్స్‌ మీటింగ్‌ ఏర్పాటు చేసి వారి పిల్లల పురోగతిని ప్రత్యక్షంగా చూపిస్తే సర్కారు బడులపై నమ్మకం పెరుగుతుందని చెప్పారు. తరగతి గదుల్లోకి వెల్లి పిల్లలతో మాట్లాడారు. విధ్యార్థులతో పాఠాలు చదివించి వారి విద్యా సామర్థ్యాన్ని పరీక్షించారు. బోర్డుపై లెక్కలు చేయించారు. మధ్యాహ్న భోజనం పరిశీలించి, మెనూ అమలు గూర్చి పిల్లలను అడిగి తెలుసుకున్నారు. ఘన్‌పూర్‌లో కిచెన్‌షెడ్‌ నిర్మాణా నికి నిధులు మంజూరు చేస్తామన్నారు. ఆయన వెంట తహసిల్దార్‌ సబ్బ రమేష్‌, ఎంపీడీవో దేవేందర్‌రెడ్డి, ఏపీవో నరేష్‌ ఉన్నారు.

Updated Date - Feb 06 , 2025 | 10:20 PM