Jajula Srinivas Goud: ‘బీసీ బిల్లు’కు అన్ని పార్టీలు మద్దతు తెలపాలి
ABN , Publish Date - Aug 31 , 2025 | 04:32 AM
అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లుకు బేషరతుగా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్ డిమాండ్ చేశారు.
అసెంబ్లీలో రాజకీయం చేస్తే ఊరుకోం: జాజుల
హైదరాబాద్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లుకు బేషరతుగా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్ డిమాండ్ చేశారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లపై చట్టం చేసిన తర్వాతనే ప్రత్యేక జీవోను తేవాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. సామాజిక రిజర్వేషన్లపై 50ు పరిమితి ఎత్తివేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.
బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచడానికి పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాలని క్యాబినెట్ నిర్ణయించడాన్ని అభినందిస్తున్నామన్నారు. బీసీ రిజర్వేషన్ అంశంపై అసెంబ్లీలో రాజకీయం చేస్తే ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రిజర్వేషన్ల చట్టానికి మద్దతు ఇవ్వని రాజకీయ పార్టీలను బీసీ ద్రోహులుగా ప్రకటిస్తామన్నారు.