Jajula Srinivas Goud: ఉప రాష్ట్రపతిగా బీసీలకు అవకాశం కల్పించాలి
ABN , Publish Date - Jul 25 , 2025 | 04:34 AM
భారత ఉప రాష్ట్రపతిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన బండారు దత్తాత్రేయ లేదా తమిళిసైను నియమించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
బండారు దత్తాత్రేయ లేదా తమిళిసైను నియమించాలి: జాజుల
హైదరాబాద్, జులై 24(ఆంధ్రజ్యోతి): భారత ఉప రాష్ట్రపతిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన బండారు దత్తాత్రేయ లేదా తమిళిసైను నియమించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రఽధాని మోదీకి బహిరంగ లేఖ రాశానని ఆయన తెలిపారు. బీసీలకు అవకాశం కల్పించడం ద్వారా చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. ఉప రాష్ట్రపతిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన జగదీప్ ధన్‌ఖడ్‌కు అవకాశం ఇచ్చి మరో రెండేళ్లు ఉన్నా అర్ధాంతరంగా రాజీనామా చేయించారని జాజుల ఆరోపించారు.