బీసీ రిజర్వేషన్ల సాధనకు ఉద్యమించాలి
ABN , Publish Date - Jan 31 , 2025 | 11:44 PM
బీసీల హక్కుల సాధనకు, రిజర్వేషన్ల అమలు కోసం ఉద్యమిం చాల్సినవసరం ఉన్నదని గొల్ల కుర్మ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజన్న యాదవ్ అన్నారు.

గొల్ల కుర్మ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజన్న
నస్పూర్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి) : బీసీల హక్కుల సాధనకు, రిజర్వేషన్ల అమలు కోసం ఉద్యమిం చాల్సినవసరం ఉన్నదని గొల్ల కుర్మ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజన్న యాదవ్ అన్నారు. నస్పూర్ ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం బీసీ జెఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు వడ్డెపల్లి మనోహర్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి 2వ తేదిన వరంగల్‌లో బీసీ రాజకీయ యు ద్ధభేరి తీన్‌మార్ మల్లన్న ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. చలో వరంగల్ కార్యక్రమంలో అధిక సంఖ్యలో బీ సీలు హాజరై విజయవంతం చేయాలన్నారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. బీసీ నిరుద్యోగుల పాలిట శాపంగా మారిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు. యుద్దభేరి సభకు అన్ని కులాలకు చెందిన వారు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు యుద్దభేరి పోస్టర్లను విడుదల చేశారు. ఈ సమావేశంలో బీసీ జాతీయ హక్కుల సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్, బీసీ సం ఘం నాయకులు పోచమల్లు, ప్రవీణ్, ఎల్లన్న, జక్కుల మల్లేష్, సమ్ము రాజన్న పాల్గొన్నారు.