Share News

Bandi Sanjay: రాముడిని ఎగతాళి చేయడం కాంగ్రెస్‌కు అలవాటే

ABN , Publish Date - Aug 26 , 2025 | 01:46 AM

రాముడిని ఎగతాళి చేయడం కాంగ్రెస్‌ కు అలవాటేనని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ.. రాముడిని పార్టీ సభ్యుడిలా చూస్తోందని సిగ్గులేకుండా మాట్లాడుతోందని మండిపడ్డారు.

Bandi Sanjay: రాముడిని ఎగతాళి చేయడం కాంగ్రెస్‌కు అలవాటే

  • దేవుని ఉనికిని తిరస్కరించే పార్టీ అది

  • కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): రాముడిని ఎగతాళి చేయడం కాంగ్రెస్‌ కు అలవాటేనని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ.. రాముడిని పార్టీ సభ్యుడిలా చూస్తోందని సిగ్గులేకుండా మాట్లాడుతోందని మండిపడ్డారు. దేవుడి ఉనికిని తిరస్కరించే కాంగ్రెస్‌, దాని మతిలేని నాయకుల నుంచి ఇంతకన్నా ఇంకేం ఆశించగలమని అన్నారు. జనహిత పాదయాత్రలో టీపీసీసీ చీఫ్‌ మహే్‌షగౌడ్‌.. బీజేపీపై చేసిన వ్యాఖ్యలను సంజయ్‌ ఖండించారు. ‘‘రామ ేసతు కేసులో శ్రీరాముడిని కోర్టుకు లాగింది కాంగ్రెస్సే. రాముడు లేడు.. రామాయణం లేదు.. అని 2007లో కాంగ్రెస్‌ ప్రభుత్వం రామసేతు కేసులో సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది.


హిందువులను హింసాత్మకులు అన్నది. రామ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు హాజరుకావడానికి నిరాకరించింది. రామ మందిర ఉద్యమం ఓడిపోయింది అని రాహుల్‌ గాంధీ అనలేదా..? కాంగ్రెస్‌ దశాబ్దాలుగా రామమందిరం తలుపులను మూసివేస్తే.. బీజేపీ తెరిచింది. బీజేపీకి రాముడంటే ప్రాణం, విశ్వాసం. రామ్‌ రాజకీయాల కోసం కాదు.. ఈ దేశ గుండె చప్పుడు’’ అని సంజయ్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు.

Updated Date - Aug 26 , 2025 | 01:46 AM