HAM Roads: హ్యామ్ రోడ్లపై నేడు అవగాహన సదస్సు
ABN , Publish Date - Aug 12 , 2025 | 05:24 AM
మండల, జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్‌శాఖల పరిధిలో హైబ్రిడ్
హైటెక్‌సిటీలోని న్యాక్ కార్యాలయంలో కార్యక్రమం
నిర్వహించనున్న ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖలు
పాల్గొననున్న బ్యాంకర్లు, కాంట్రాక్టర్లు, వర్క్ ఏజెన్సీలు
హైదరాబాద్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): మండల, జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్‌శాఖల పరిధిలో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్(హ్యామ్)లో రోడ్ల నిర్మాణం, విస్తరణ చేపట్టిన ప్రభుత్వం ఈ విధానంపై అవగాహన సదస్సు నిర్వహిస్తోంది. హ్యామ్ విధానం ఎలా ఉంటుంది, పనుల గుర్తింపు, నిర్మాణం, టెండర్ల ఆహ్వానం, బిల్లుల చెల్లింపులపై బ్యాంకర్లు, కాంట్రాక్టర్లు, వర్క్ ఏజెన్సీలకు అవగాహన (హ్యామ్ ప్రాజెక్ట్ రోడ్ షో) కల్పించనున్నారు. మంగళవారం హైటెక్‌సిటీలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్‌లో జరిగే కార్యక్రమంలో ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్కతో పాటు ఉన్నతాధికారులు, నిపుణులు పాల్గొంటారు. హ్యామ్ విధానంలో రహదారుల నిర్మాణానికి సంబంధించిన ప్రభుత్వ విజన్, ప్రాజెక్టు విధి విధానాలు, ప్రత్యేకతలు, పని ప్రణాళికలు, నిర్మాణ కాలం, అర్హతలు, ఎంపిక విధానంపై వివరిస్తారు. ఈ విధానంలో ప్రభుత్వం 40% ఇవ్వగా మిగిలిన 60% నిధులను కాంట్రాక్టర్లు రుణం ద్వారా వెచ్చిస్తారు. మొదటిసారి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు హ్యామ్‌ను తీసుకువెళ్తోంది. ఈ విధానంలో రహదారులను అభివృద్ధి చేసినా ప్రజలపై టోల్ భారం లేకుండా రూపొందించారు.