కుష్ఠువ్యాధిపై అవగాహన పెంచాలి : డీఎంహెచ్‌వో
ABN , Publish Date - Jan 30 , 2025 | 11:26 PM
విద్యార్థులు సా మాజిక బాధ్యతగా కుష్ఠు వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని, కు టుంబ సభ్యులకు అవగాహన క లిపించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ స్వరాజ్యలక్ష్మి అన్నారు.

కందనూలు, జనవరి 30 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులు సా మాజిక బాధ్యతగా కుష్ఠు వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని, కు టుంబ సభ్యులకు అవగాహన క లిపించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ స్వరాజ్యలక్ష్మి అన్నారు. జాతీయ కుష్ఠు వ్యాధి నివారణం దినం సంద ర్భంగా జిల్లా కేంద్రంలోని గీతాంజలి జూనియర్ కళాశాలలో గురువారం విద్యార్థులకు కుష్ఠువ్యా ధి లక్షణాలు, నివారణ చర్యలు, కుష్ఠువ్యాధి చికిత్సపై అవగాహన కలిగిస్తూ విద్యార్థులచే ప్ర తిజ్ఞ చేయించారు. కుష్ఠువ్యాధిని తొలి దశలోనే గుర్తించి సమాజంలో ఇతరులకు సోకకుండా నివారణ చర్యలు చేపట్టాలని విద్యార్థులను కో రారు. కార్యక్రమంలో ఉప జిల్లా వైద్యారోగ్య శా ఖ అధికారి డాక్టర్ ఎం.వెంకటదాస్, డిప్యూటీ పారామెడికల్ అధికారులు మధుమోహన్, పి. సుకుమార్‌రెడ్డి, వెంకటయ్య, హెల్త్ ఎడ్యుకేటర్ నరసింహ, మాజీ కౌన్సిలర్ సు నేంద్ర, కళాశాల ప్రిన్సిపాల్ శరత్, అధ్యాపకులు పాల్గొన్నారు.