Share News

ఫోన్‌ కాల్‌తో అందుబాటులోకి సైబర్‌ వారియర్‌

ABN , Publish Date - Feb 10 , 2025 | 11:38 PM

అనుకోని రీతితో సై బర్‌ నేరానికి గురైనప్పుడు కంగారుపడకుండా ఒక్క ఫోన్‌కాల్‌ (1930)చేస్తే చాలు. సైబర్‌ వారియర్స్‌ ఫోన్‌లో ఫిర్యాదులను స్వీకరి స్తుందని రామగుండం సీపీ శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం సైబర్‌ నేరాల కట్టడిపై కమిషనరేట్‌ కార్యాలయంలో సిబ్బందికి శిక్షణ కార్య క్రమం నిర్వహించారు.

ఫోన్‌ కాల్‌తో అందుబాటులోకి   సైబర్‌ వారియర్‌

ఫ రామగుండం సీపీ శ్రీనివాస్‌

మంచిర్యాల క్రైం, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి) : అనుకోని రీతితో సై బర్‌ నేరానికి గురైనప్పుడు కంగారుపడకుండా ఒక్క ఫోన్‌కాల్‌ (1930)చేస్తే చాలు. సైబర్‌ వారియర్స్‌ ఫోన్‌లో ఫిర్యాదులను స్వీకరి స్తుందని రామగుండం సీపీ శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం సైబర్‌ నేరాల కట్టడిపై కమిషనరేట్‌ కార్యాలయంలో సిబ్బందికి శిక్షణ కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అను కోకుండా సైబర్‌ నేరానికి గురైనప్పుడు కంగారుపడకుండా 1930కు ఫోన్‌ చేస్తే నేషనల్‌ సైబర్‌ క్రైం రిపోర్టింగ్‌ పోర్టల్‌ (ఎన్‌సీఆర్‌పి) నేరాన్ని నిరోధించడం, అనుమానిత ఐడెంటిఫైలను విశ్లేషించడం, అలాగే సోషల్‌ మీడియా, ఆన్‌లైన్‌ మోసాలపై దర్యాప్తు చేయడం వంటి వాటిపై వారికి శిక్షణ కల్పిస్తామని తెలిపారు. పోలీస్‌స్టేషన్‌ టీ ఎస్సీఎస్‌బీ మద్య సైబర్‌వారియర్స్‌ సమన్వయకర్తలుగా పని చేస్తా రని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ అడ్మిన్‌ రాజు, స్పెషల్‌ బ్రాంచి ఏసీపీ రాఘవేందర్‌రావు, సైబర్‌ క్రైం ఇన్స్పెక్ట ర్‌ శ్రీనివాస్‌, సిబ్బంది, పాల్గొన్నారు.

Updated Date - Feb 10 , 2025 | 11:38 PM