అందుబాటులోకి ఏసీబీ ఆఫీస్
ABN , Publish Date - Feb 17 , 2025 | 11:31 PM
జిల్లా ప్రజలకు ఏసీబీ కార్యాలయం మరింత చేరువ కా నుంది. కార్యాలయాన్ని త్వరలో జిల్లా కేంద్రంలో ఏ ర్పాటు చేయనుండడంతో అక్రమార్కుల్లో ఆందోళన మొదలైంది.

జిల్లా కేంద్రంలో త్వరలో ఏర్పాటు
ప్రభుత్వ కార్యాలయాల్లో పెరిగిపోతున్న అక్రమార్కులు..!
ఏసీబీని ఆశ్రయిస్తున్న బాధితులు
మంచిర్యాల, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): జిల్లా ప్రజలకు ఏసీబీ కార్యాలయం మరింత చేరువ కా నుంది. కార్యాలయాన్ని త్వరలో జిల్లా కేంద్రంలో ఏ ర్పాటు చేయనుండడంతో అక్రమార్కుల్లో ఆందోళన మొదలైంది. జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయా ల్లో అవినీతి, అక్రమాలు రోజురోజుకూ మితి మీరి పోతున్నాయి. ప్రతీ పనికీ కొంత వసూలు చేస్తున్న ట్లు ప్రచారం జరుగుతోంది. అసలు ముడుపులు చె ల్లించనిదే ఫైళ్లు ముందుకు కదలడం లేదనే అభి ప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సంబం ధిత అధికారుల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం జ రుగుతుండగా ప్రజలు, వినియోగదారులు కార్యాల యానికి వెళ్లి ముడుపులు చెల్లించుకోక తప్పడం లే దు. ఈ క్రమంలో జిల్లా కేంధ్రంలో ప్రత్యేకంగా ఏ సీబీ కార్యాలయాన్ని తెరిచేందుకు ఆ శాఖ ఉన్నతా ధికారులు సన్నద్ధం అవుతున్నారు.
జిల్లా కేంధ్రంలోనే..!
ప్రస్తుతం ఏసీబీ కార్యాలయం ఆదిలాబాద్‌లో ఉంది. ఆదిలాబాద్ ప్రధాన కేంద్రంగా ఉమ్మడి జిల్లా లోని కుమురంభీం, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబా ద్ నుంచి పర్యవేక్షణ జరుగుతోంది. అవినీతి ఆరో పణలు ఎదుర్కొంటున్న అధికారులపై దాడులు చే యాలంటే ఆదిలాబాద్ నుంచి సుమారు 300 కిలో మీటర్ల మేర ప్రయాణం చేయాల్సి వస్తోంది. దీం తో కార్యాలయాన్ని మంచిర్యాలలో ఏర్పాటు చేయా లనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జిల్లా కేం ద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న మహిళా పోలీస్ స్టేషన్‌లోనే ఏసీబీ కార్యాలయాన్ని ప్రారంభిం చేందుకు దాదాపుగా ఏర్పాట్లు పూర్తయినట్లు తెలు స్తోంది. గరిష్టంగా 15 రోజుల్లోగా ఏసీబీ కార్యా లయం ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీం తో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడు తున్నాయి. మంచిర్యాలలోనే ఉమ్మడి జిల్లాకు చెం దిన ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా ఇక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగించే యోచ నలో సంబంధిత అధికారులు ఉన్నారు.
జిల్లాలో పలు ఘటనలు..
లంచం తీసుకుంటున్న అవినీతి అధికారులను ఏ సీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పలు సంఘటన లు జిల్లాలో కోకొల్లలుగా ఉన్నాయి. దండేపల్లి మం డలంలోని రెబ్బెనపల్లి అప్పటి వీఆర్‌వో ఎండీ ఇలి యాజ్, నంబాలకు చెందిన గోపతి శ్రీనివాస్ అనే రైతు నుంచి 1.17 ఎకరాల భమిని విరాసత్ చేసేం దుకు రూ.3వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వీఆర్‌వోను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకు న్నారు. మంచిర్యాల పట్టణంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి అప్పటి కాసిపేట త హసీల్దార్ అలుగునూరి రోశయ్యను రూ.10వేలు లం చం తీసుకుంటుండగా పట్టుకున్నారు. లక్షెట్టిపేట మండలంలోని మోదెల వీఆర్‌వో రత్నయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుని వద్ద రూ.4వేలు లంచం తీసుకుం టుండగా కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్, అధికా రులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అప్పటి భీమి ని ఎంఈవో గంగాసింగ్ సైతం బెల్లంపల్లి పట్టణం లో సాక్షర భారత్ విలేజ్ కోఆర్డినేటర్ పద్మ నుంచి రూ.4వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. లక్షెట్టిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి సివిల్ సర్జన్ డాక్టర్ రవీంధర్‌నాయక్‌ను ఏసీబీ అధికారులు రూ. 6వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. దండేపల్లి మండలం లక్ష్మీకాంతాపూర్‌కు చెందిన రైతు తౌ డం కిషన్‌కు మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు రూ. 6వేలు లంచం తీసుకుంటూ వైద్యుడు ఏసీబీకి పట్టుబడ్డాడు. మంచిర్యాల ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న తు మ్మల లింగమూర్తి తోటి ఉద్యోగివద్ద రూ. 4వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. దీపావళి పండుగను పురష్కరించుకొని మంచిర్యాలలో టపాకాయల వ్యాపారులవద్ద డ బ్బులు డిమాండ్ చేసిన పలు ప్రభుత్వ కార్యాలయాల అధికారులు, సిబ్బందిపై ఏసీబీ అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇందులో అగ్నిమాపకశాఖ, పోలీస్, మున్సిపల్, ఆర్డీవో కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, విద్యుత్‌శాఖకు చెందిన పలువు రు అధికారులు, కిందిస్థాయి సిబ్బంది ఉండటం గమనార్హం. ఒకే ఘటనలో ఏకంగా ఆరు ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన సిబ్బం ది కేసుల్లో ఇరుక్కోవడం జిల్లాలోనే ప్రథమంగా చెప్పుకోవచ్చు. అ లాగే మంచిర్యాల నీటి పారుదలశాఖ అధికారులు శుక్రవారం లం చం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడ్డారు. జిల్లా లోని జైపూర్ మండలం మిషన్ కాకతీయలో భాగం గా ఐదు చెరువులకు సంబంధించిన బిల్లులు ఇచ్చేందుకు మంచిర్యాల నీటిపారుదల శాఖకు చెందిన డీఈ బాలసిద్దూ, ఈఈ వినో ద్ కుమార్‌లు లంచం జైపూర్ మండలంలోని దాంపూర్ ఊరచెరువు, పెగడపెల్లి, మద్దికుంట, ఆరెపల్లి, మద్దికల్ చెరువులను మి షన్ కాకతీయ పనులకు సంబంధించి బిల్లుల మంజూరు కోసం కాంట్రాక్టర్ రవీంధర్ నుంచి రూ. లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఇవిగాక జిల్లాలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల కు చిక్కిన ఘటనలు అనేకం ఉన్నాయి.