Share News

ప్రభుత్వ పథకాలను వినియోగించుకోండి

ABN , Publish Date - Jan 21 , 2025 | 11:27 PM

ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. నస్పూర్‌ మున్సిపాలిటీలోని శ్రీరాంపూర్‌ ఏరియాలో మంగళవారం 1 నుంచి 8 వార్డుల్లో వార్డు కమిటీ సమావేశాలు ఏర్పాటు చేయగా, 5వ వార్డులో ఆయన మాట్లాడారు. ప్రభు త్వం ద్వారా ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్‌కార్డులు, రేషన్‌కార్డుల్లో సవరణలు, రైతు భరోసా కల్పిస్తున్న ట్లు చెప్పారు.

ప్రభుత్వ పథకాలను వినియోగించుకోండి
5వ వార్డులో మాట్లాడుతున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

- జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

శ్రీరాంపూర్‌, జనవరి 21(ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. నస్పూర్‌ మున్సిపాలిటీలోని శ్రీరాంపూర్‌ ఏరియాలో మంగళవారం 1 నుంచి 8 వార్డుల్లో వార్డు కమిటీ సమావేశాలు ఏర్పాటు చేయగా, 5వ వార్డులో ఆయన మాట్లాడారు. ప్రభు త్వం ద్వారా ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్‌కార్డులు, రేషన్‌కార్డుల్లో సవరణలు, రైతు భరోసా కల్పిస్తున్న ట్లు చెప్పారు. కొందరికి నూతనంగా కార్డులు మంజూరయ్యాయని, ఆయా జాబితాల్లో పేర్లు లేనివారు అర్హులై తే నూతనంగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. రేషన్‌ కార్డులు కలిగి ఉండి కుటుంబ సభ్యుల పేర్లు లేకుంటే కనమో దు చేసుకోవచ్చని సూచించారు. 8వ వార్డులో అదనపు కలెక్టర్‌ సభావత్‌ మోతీలాల్‌ మాట్లాడుతూ, ప్రభుత్వం ద్వారా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వివిధ పథకాల్లో లబ్ధిపొందాలని కోరారు. ఆయా సమా వేశాల్లో నస్పూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ సరిమిల్ల వేణు, వైస్‌ చైర్మన్‌ గెల్లు రజిత-మల్లేష్‌, మున్సిపల్‌ కమిషనర్‌ చిట్యాల సతీష్‌, డిప్యూటీ తహసీల్దార్‌ రాజేశ్వర్‌రావు, మున్సిపల్‌ మేనేజర్‌ కరుణాకర్‌, స్థానిక కౌన్సిలర్లు, వార్డు ఆఫీసర్లు పాల్గొన్నారు.

తప్పుడు కేసుల పెట్టి భయపెడుతున్నారు...

మాజీ ఎమ్మెల్యే దివాకర్‌ రావు

నస్పూర్‌, జనవరి 21 (ఆంధ్రజ్యోతి) : అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నరని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌ రావు ఆరోపించారు. నస్పూర్‌ ప్రెస్‌ క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. 18వ వార్డు తీగల్‌పహాడ్‌కు చెందిన బీఆర్‌ఎస్‌ ప్రశాంత్‌ అనే కార్యకర్తపై అక్రమంగా ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ, ఇతర సెక్షన్లపై కేసు నమోదు చేయించడంలో కాంగ్రెస్‌ నాయకుల పాత్ర ఉందన్నారు. అధికారం శాశ్వతం కాదని వచ్చే 2028లో తాము అధికారంలోకి వస్తామని, ప్రతి దానికి సమాధానం అప్పుడు వస్తుందన్నారు. ఇంటి ముందుర ఉన్న యువతికి చెందిన ఈ-మెయిల్‌ ఐడీని మరొక వ్యక్తి ఓపెన్‌ చేసి తప్పుడు సమాచారం సెండ్‌ చేయడం వలన ఆ యువతి ఉద్యోగం ఆగిపోయిందన్నారు. యువతికి అన్యాయం జరిగిందని అడిగినందుకు కందుల ప్రశాంత్‌పై అక్రమం కేసు నమోదు చేయిం చారన్నారు. సోమవారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకుని ఆర్థరాత్రి విచారణ పేరిట ఇళ్లకు వెళ్లి వి చారణ చేయడమేమిటని ప్రశ్నించారు. ఏమి చెప్పవద్దని యువతిని పోలీసులు బెదిరింపులకు గురి చే సారన్నారు. ఎమ్మెల్యేకు సంబంధం లేకుంటే బాధితులను పోలీసులు ఎందుకు బెదిరిస్తున్నరన్నారు. ఇలాంటి చర్యల కారణంగా పోలీసులకు మాయని మచ్చగా మిగిలిపోతాయన్నారు. దీనిపై పోలీస్‌ ఉన్నఽతాధికారులకు పిర్యాదు చేయనున్నట్లు దివాకర్‌ రావు వెల్లడించారు. నస్పూర్‌లో ఎన్నికల తర్వాత ఇళ్లు కూల్చి భయందోళనలు సృష్టించారని, టీఎన్‌జీవోల ఇళ్లను ఆపిన వారు మళ్ళి వాటిని ఏలా కొనసాగిస్తున్నరని ప్రశ్నించారు. ప్రశాంత వాతావరణ చెదిరిపోయిందని, ప్రతిపక్షాలపై కేసులు పెట్టడం, దాడులకు పాల్పడడం జరుగుతుందన్నారు. ప్రశాంత్‌ పెట్టిన అక్రమ కేసు రాజకీయ కక్షతో పెట్టారని, దీనిని ఖండిస్తున్నమన్నారు. ఈ సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి మెరుగు పవన్‌ కుమార్‌, నాయకులు వంగ తిరుపతి, గోగుల రవీందర్‌ రెడ్డి, పానుగంటి సత్తయ్య, సంపత్‌ కుమార్‌, జనార్థన్‌, రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 21 , 2025 | 11:28 PM