Share News

Stomach Pain,: జ్వరంతో ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి

ABN , Publish Date - Feb 17 , 2025 | 01:32 AM

ములుగు జిల్లా వాజేడు మండలంలోని పేరూరు బాలుర ఆశ్రమ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న సోయం వినిత్‌(13)కు ఈనెల 11న కడుపు నొప్పి రాగా ఏఎన్‌ఎం మాత్ర ఇవ్వగా కడుపునొప్పి తగ్గింది.

 Stomach Pain,: జ్వరంతో ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి

హెచ్‌ఎం, వార్డెన్‌ నిర్లక్ష్యమంటూ ఆదివాసీ సంఘాల ఆందోళన

వాజేడు, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): జ్వరం, కడుపునొప్పితో బాధపడుతూ ఓ ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి చెందాడు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని పేరూరు బాలుర ఆశ్రమ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న సోయం వినిత్‌(13)కు ఈనెల 11న కడుపు నొప్పి రాగా ఏఎన్‌ఎం మాత్ర ఇవ్వగా కడుపునొప్పి తగ్గింది. రెండు రోజులు సెలవు రాగా విద్యార్థి అదే గ్రామంలోని మేనమామ ఇంటికి వెళ్లాడు. శనివారం జ్వరం రావటంతో మెరుగైన వైద్యం కోసం ఏటూరునాగారం తరలిస్తుండగా మార్గమధ్యలోనే బాలుడు మృతిచెందాడు. అతడి మృతికి హాస్టల్‌ వార్డెన్‌, ప్రధానోపాధ్యయుడి నిర్లక్ష్యమే కారణమని ఆదివాసీ సంఘాల నేతలు వసతి గృహం ఆవరణంలో ధర్నా చేశారు.

Updated Date - Feb 17 , 2025 | 01:32 AM