iBOMMA Ravis Bail: ఐ బొమ్మ రవి కేసు.. బెయిల్ వస్తుందా?
ABN , Publish Date - Dec 04 , 2025 | 04:51 PM
సినిమా పైరసీకి పాల్పడ్డ ఇమంది రవి అలియాస్ ఐ బొమ్మ రవి బెయిల్ పిటిషన్‌కు సంబంధించి తాజాగా నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. బెయిల్, కస్టడీ పిటిషన్లపై నాంపల్లి కోర్టు రేపు(శుక్రవారం) తీర్పు ఇవ్వనుంది.
ఐ బొమ్మ రవి కస్టడీ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. బెయిల్, కస్టడీ పిటిషన్లపై నాంపల్లి కోర్టు రేపు(శుక్రవారం) తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే తీర్పును రిజర్వ్ చేసి ఉంచింది. ఐ బొమ్మ రవి నుంచి కీలక సమాచారాన్ని ఇంకా సేకరించాల్సి ఉందని పోలీసుల తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. రవి బెయిల్ పిటిషన్‌పై కూడా వాదనలు కొనసాగాయి. కేసు విచారణ దశలో బెయిల్ మంజూరు చేయవద్దంటూ పోలీసుల తరఫు న్యాయవాది కోర్టును కోరారు. 4 కేసుల్లో వేర్వేరుగా రవి పైరసీ పట్ల విచారణ చేపట్టాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. వాదోపవాదాలు విన్న కోర్టు బెయిల్ ,కస్టడీ పిటిషన్‌లపై శుక్రవారం తీర్పు వెల్లడించనుంది.
రవికి బంపర్ ఆఫర్..
విచారణ సందర్భంగా ఇమంది రవి తెలివితేటల్ని పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు. పోలీసు శాఖలోని సైబర్ క్రైమ్ విభాగంలో పని చేస్తావా? అంటూ రవిని వారు అడిగినట్లు సమాచారం. మంచి జీతం సైతం ఇస్తామని అతడికి ఆఫర్ చేశారని తెలుస్తోంది. రవి మాత్రం పోలీసులు ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించాడట. కరేబియన్ దీవుల్లో రెస్టారెంట్ ఏర్పాటు చేస్తానని వారికి చెప్పినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
నువ్వు దేవుడివి సామీ.. కరెంట్ షాక్ కొట్టిన పాముకు నోటితో..
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన