Share News

అపురూప శిలాజ సంపద అన్యాక్రాంతం

ABN , Publish Date - Feb 09 , 2025 | 11:41 PM

వేమనపల్లి మండలం సుం పుటం గ్రామ శివారు ప్రాంతం నుంచి ప్రవహిస్తున్న ప్రాణహిత నది ప్రాంతంలోని కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్న అపురూప మైన శిలాజ సంపదను కొందరు అక్రమంగా పగులగొట్టి మత్తడి వాగు అప్రోచ్‌రోడ్డు నిర్మాణానికి వాడుతున్నారని బీజేపీ నాయకులు మండి పడ్డారు.

అపురూప శిలాజ సంపద అన్యాక్రాంతం

వేమనపల్లి, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి) : వేమనపల్లి మండలం సుం పుటం గ్రామ శివారు ప్రాంతం నుంచి ప్రవహిస్తున్న ప్రాణహిత నది ప్రాంతంలోని కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్న అపురూప మైన శిలాజ సంపదను కొందరు అక్రమంగా పగులగొట్టి మత్తడి వాగు అప్రోచ్‌రోడ్డు నిర్మాణానికి వాడుతున్నారని బీజేపీ నాయకులు మండి పడ్డారు. ఆదివారం వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఏట మ ధుకర్‌, నాయకులు మత్తడి వాగు వద్దకు వెళ్లి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ సుంపుటం నది ప్రాంతంలో కొన్ని వందల సంవత్సరాల నాటి శిలజ సంపదను అక్రమంగా తరలించిన అప్రోచ్‌రోడ్డు గుత్తేదా రుపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. అప్రోచ్‌ రోడ్డు రివిట్‌మెంట్‌ కోసం అరుదైన లాజాలను పగులగొట్టి ట్రాక్టర్ల ద్వా రా వంతెన వద్దకు తీసుకువచ్చి వాడుతున్నారని ఆరోపించారు. ఈ వ్య వహారంపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కార్యక్ర మంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ఎనుముల వెంకటేష్‌, నా యకులు కంపెల అజయ్‌, కోయిల స్వామి పాల్గొన్నారు.

Updated Date - Feb 09 , 2025 | 11:41 PM