బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
ABN , Publish Date - Feb 07 , 2025 | 12:06 AM
జిల్లా కేంద్రంలోని వీటీ కాలనీలోని శ్రీ దేవీ భూదేవీ సహిత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో స్వామివారి బ్రహోత్సవాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి.

బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
ఆలయంలో ప్రారంభమైన పూజలు
సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన నిర్వాహకులు
నల్లగొండ కల్చరల్, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని వీటీ కాలనీలోని శ్రీ దేవీ భూదేవీ సహిత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో స్వామివారి బ్రహోత్సవాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 10 తేదీ వరకు నిర్వహించే బ్రహోత్సవాలకు ఆలయమంతా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత దీపాలతో అ లంకరించారు. బ్రహ్మశ్రీ కృష్ణావధాని మంగళశాసనాలతో ఆలయ ప్రధాన అర్చకులు మహంకాళీ పవనశర్మ ఆధ్వర్యంలో అర్చకస్వాములు మూర్తి, భాస్వంతశర్మ, మురళిశర్మ, సాయిశర్మ గురువారం ఉదయం వేద మంత్రోచ్ఛారణ మధ్య శాసో్త్రక్తంగా పూజ లు నిర్వహించి అంకురార్పణ చేశారు. తొలిరోజున ఉదయం నుంచి రాత్రి వరకు పండితులు ఆలయంలో బ్రహోత్సవాల కు శ్రీకారం చుట్టి గణపతిపూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాశన, రక్షాబంధనం, గోపూజ, అఖండ స్థాపన, నాంది దేవతాహ్వానం, క్షేత్రపాలక ఆంజనేయస్వామికి, లక్ష్మీగణపతికి అభిషేకాలు, యాగశాల ప్రవేశం, అంకురారోపణ, నవగ్రహ, వాస్తు, క్షేత్రపాలక, మూల మంత్రజపం వంటి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ లయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ నెల 7న ఉదయం 6 నుంచి 8 గంటల వరకు జపహోమ అనుష్ఠానపారాణం, ఆవాహిత స్థాపిత దేవాత పూజలు, శ్రీ వేంకటేశ్వరస్వామికి సహస్ర ఘటాభిషేకం, సాయంత్రం శ్రీలక్ష్మీ కుంకుమార్చన, రాజరాజేశ్వరీ అమ్మవారికి అర్చనలు, హోమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 8వ తేదీన పంచముఖ ఆంజనేయ స్వామివారికి అభిషేకాలు, పంచాయతన చంద్రమౌళీశ్వస్వామికి అర్చనలు, 9న సరస్వతి సమారాధన, గాయత్రీకి అభిషేకాలు, సాయంత్ర గరుడ వాహనసేవ 10న శ్రీదేవి, భూదేవీ సహిత శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్యకల్యాణ మహోత్సవం, పూర్ణాహుతి, అన్నసంతర్పణ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు కేవీఎన నర్సింహమూర్తి, మేడం ప్రభాకర్, నూకల జయపాల్‌రెడ్డి, రావిరాల పూజిత వెంకటేశ్వర్లు, నాగులపల్లి శ్యాంసుందర్, పురుషోత్తం, గోపాల్, గోపాలకృష్ణామూర్తి, లింగారెడ్డి, గిరిజ, విజయ్, లక్ష్మి, రాజేశ్వరి పాల్గొన్నారు.