Share News

గొడ్డు కారం ఘటనపై విచారణ జరిపించాలి

ABN , Publish Date - Jan 09 , 2025 | 12:50 AM

మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని బాలికల వసతిగృహంలో నెలకొన్న గొడ్డుకారంతో అనే సంఘటనపై విచారణ జరిపించాలని బీఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున డిమాండ్‌ చేశారు.

  గొడ్డు కారం ఘటనపై విచారణ జరిపించాలి
వీసీకి వినతిపత్రం అందజేస్తున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగార్జున

గొడ్డు కారం ఘటనపై విచారణ జరిపించాలి

ఎంజీయూ వీసీకి బీఆర్‌ఎస్వీ వినతి

నల్లగొండ, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని బాలికల వసతిగృహంలో నెలకొన్న గొడ్డుకారంతో అనే సంఘటనపై విచారణ జరిపించాలని బీఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున డిమాండ్‌ చేశారు. బుధవారం బీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో వైస్‌ చానల్సర్‌ ఖాజా అల్తాఫ్‌హుస్సేనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ఇలాంటి సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులపై చర్య తీసుకోవాలని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కా కుండా చూడాలని కోరారు. బీఆర్‌ఎస్వీ విద్యార్థులకు అం డగా ఉంటుందని ఏ సమస్య వచ్చిన వీసీతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి చల్లా కోటేష్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి నోముల క్రాంతి, తేనాలి సైదిరెడ్డి, కత్తుల బంగారు, శంకర్‌, యుగందర్‌, సైదులు పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2025 | 12:50 AM