Share News

కర్రె గుట్టల నుంచి కేంద్ర బలగాలు వెనక్కి

ABN , Publish Date - May 11 , 2025 | 05:28 AM

భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్తతల దృష్ట్యా వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టు ఏరివేతలో నిమగ్నమైన పారా మిలటరీ బలగాలను కేంద్రం వెనక్కి పిలిచింది.

కర్రె గుట్టల నుంచి కేంద్ర బలగాలు వెనక్కి

హైదరాబాద్‌, మే 10 (ఆంధ్రజ్యోతి): భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్తతల దృష్ట్యా వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టు ఏరివేతలో నిమగ్నమైన పారా మిలటరీ బలగాలను కేంద్రం వెనక్కి పిలిచింది. ఛత్తీ్‌సగఢ్‌ కేంద్రంగా కర్రెగుట్టల్లో కూంబింగ్‌ చేపట్టిన సీఆర్‌పీఎఫ్‌, కోబ్రా యూనిట్లకు చెందిన 5 వేల మంది సిబ్బంది శనివారం తమ క్యాంపుల నుంచి తరలివెళ్లారు.


మిగతా 4వేల మంది.. 24 గంటల్లో హెడ్‌ క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కొన్నాళ్ల పాటు ఆపరేషన్‌ కగార్‌ను ఆయా రాష్ట్రాలకు చెందిన డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌గార్డ్స్‌ (డీఆర్‌జీ), బస్తర్‌ ఫైటర్స్‌, స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌, గ్రేహౌండ్స్‌ బలగాలతో కొనసాగించాలని కేంద్ర హోంశాఖ సూచించినట్లు సమాచారం.

Updated Date - May 11 , 2025 | 05:28 AM