Share News

Free Education for Transgenders: అంబేడ్కర్‌ వర్సిటీలో ట్రాన్స్‌జెండర్లకు ఉచిత విద్య

ABN , Publish Date - Aug 11 , 2025 | 04:16 AM

అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ట్రాన్స్‌జెండర్లందరికీ ఉచితంగా డిగ్రీ కోర్సులను

Free Education for Transgenders: అంబేడ్కర్‌ వర్సిటీలో ట్రాన్స్‌జెండర్లకు ఉచిత విద్య

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ట్రాన్స్‌జెండర్లందరికీ ఉచితంగా డిగ్రీ కోర్సులను అందించనున్నట్లు వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొ. ఘంటా చక్రపాణి వెల్లడించారు. ట్రాన్స్‌జెండర్లకు ఇలాంటి అవకాశం కల్పించిన మొదటి విశ్వవిద్యాలయంగా అంబేడ్కర్‌ వర్సిటీ నిలవనుందని పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద ఇంటర్‌ విద్యార్హత కల్గిన ఏ ట్రాన్స్‌జెండర్‌ అయినా వర్సిటీ అందించే డిగ్రీ కోర్సుల్లో చేరవచ్చన్నారు. కేవలం నామమాత్రపు రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.500 మాత్రమే చెల్లిస్తే సరిపోతుందన్నారు. ఇతర వివరాల కోసం హెల్ప్‌ డెస్క్‌: 040-23680333/ 040-23680555, కాల్‌సెంటర్‌ : 18005990101, వెబ్‌సైట్‌ ఠీఠీఠీ.ఛట్చౌఠ.్చఛి.జీుఽ, ఠీఠీఠీ.ౌుఽజూజీుఽ్ఛ.ఛట్చౌఠ.్చఛి.జీుఽ నుంచి వివరాలు తెలుసుకోవచ్చన్నారు.

Updated Date - Aug 11 , 2025 | 04:16 AM