Share News

బాల్యమంతా సాగర్‌లోనే..

ABN , Publish Date - Jan 14 , 2025 | 12:59 AM

నాగార్జునసాగర్‌, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): మాజీ ఎంపీ మందా జగన్నాథానికి సాగర్‌తో విడదీయలేని అనుబంధం ఉంది. బాల్యం అంతా సాగర్‌లోనే గడిపారు.

 బాల్యమంతా సాగర్‌లోనే..

నాగార్జునసాగర్‌, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): మాజీ ఎంపీ మందా జగన్నాథానికి సాగర్‌తో విడదీయలేని అనుబంధం ఉంది. బాల్యం అంతా సాగర్‌లోనే గడిపారు. సాగర్‌ హిల్‌కాలనీ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 8వ తరగతి వరకు ఆయన చదువుకున్నారు. మందా జన్నాథం స్వస్థలం మహబూబ్‌నగర్‌ జిల్లా ఇటిక్యాల మం డలం కొండేరు గ్రామం. కాగా సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఆయన తల్లిదండ్రులు సాగర్‌కు వచ్చారు. ఆయన తండ్రి పెద్దపుల్లయ్య సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణంలో మోకానికల్‌ విభాగంలో వాచమనగా పనిచేయగా, తల్లి సవరమ్మ హిల్‌కాలనీలో హెల్త్‌ ఆఫీ్‌సలో ఆయగా పనిచేశారు. సాగర్‌లో ఆయన కుటుంబ సభ్యులు ఫైలాన కాలనీలో కొంత కాలం, హిల్‌కాలనీలో ఈ-1 టైపు క్వార్టర్‌లో కొంత కాలం నివసించారు. ఆయన తల్లిదండ్రులు ఉద్యోగ విరమణ తర్వాత సాగర్‌ నుంచి వెళ్లి పోయారు. 2023 ఆగస్టు 11న ఆయన స్నేహితుడు ఆవుల యాదగిరి దశదిన కర్మలో పాల్గొన్నారు. సాగర్‌కు వచ్చిన ప్రతి సారీ ఆయన తన స్నేహితులతో ఆనందంగా గడిపేవారని మరో స్నేహితుడు రాందాసు తెలిపారు. అంతే కాకుండా నందికొండ మునిసిపల్‌ మాజీ వైస్‌ చైర్మన మందా రఘువీర్‌కు మాజీ ఎంపీ జగన్నాథం దగ్గరి బంధువు కావడంతో చాలా సార్లు సాగర్‌కు వచ్చారు. జగన్నాథం మృతి చెందడంతో ఆయన స్నేహితులు ఆయనతో గడిపిన జ్ఞాపకాలను కొందరు గుర్తు చేసుకోగా మరి కొందరు ఆయన అంత్యక్రియలకు వెళ్లారు.

Updated Date - Jan 14 , 2025 | 12:59 AM