Share News

భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి

ABN , Publish Date - Feb 06 , 2025 | 01:11 AM

నల్లగొండ నర్సింహస్వామి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్‌ బి. సత్యప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం మడలంలోని నల్లగొండ గ్రామ శివారులో ఎత్తైన కొండపైన ఉన్న శ్రీలక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 8 నుంచి ప్రారంభం కానున్నాయి.

భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

కొడిమ్యాల, ఫిబ్రవరి5(ఆంధ్రజ్యోతి): నల్లగొండ నర్సింహస్వామి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్‌ బి. సత్యప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం మడలంలోని నల్లగొండ గ్రామ శివారులో ఎత్తైన కొండపైన ఉన్న శ్రీలక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 8 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయానికి ఉన్న ఫార్మేషన్‌ దారిని, రోడ్డు వెంబడి, కింద గుడి ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఫార్మేషన్‌ రోడ్డు మార్గం ద్వారా గుట్టపైకి ఎక్కి నల్లగొండ నర్సింహస్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అంతక ముందు అర్చకులు కలెక్టర్‌కు అధికారులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కింది స్థాయి అధికా రులతో కలిసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాల న్నారు. శానిటేషన్‌ పనులు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎండలో ఎలాంటి ఇబ్బందులు కలు గకుండా చలువ పందిళ్లను ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు తాగు నీటి కొరత, విద్యుత్‌ కొరత లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షిం చాలని ఆదేశించారు. గుట్టపై తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేసి శుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులకు కోసం వైద్య శిబిరం ఏర్పాటు చేయాలన్నారు. వాహనాల పార్కింగ్‌ స్థలంలో ఎలాంటి ఇబ్బందులు కలుకగకుండా చూడాలన్నారు. బ్రహ్మోత్సవాలకు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది షిప్టుల వారీగా విధులు నిర్వహించి జాతరను విజయవంతం చేయాలని ఆదేశించారు. గుట్టపైన భక్తులు ఫొటోలు తీసుకునే సమయంలో ప్రమాదాలు జరుగకుండా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయక కమిషనర్‌ సుప్రియ, ఇన్‌చార్జి డీపీవో మదన్‌మొహన్‌, ఆర్డీవో మధుసూదన్‌గౌడ్‌, ఎంపీడీవో స్వరూప, తహసీల్దార్‌ రమేష్‌, ఆలయ ఈవో వెంకన్న, ఏఈఈ చంద్ర శేఖర్‌, ఏపీవో సతీష్‌, ఏవో జ్యోతి పలు గ్రామాల కార్యదర్శులు సాయిలు, శేఖర్‌, స్వామి, ఆలయ సిబ్బంది కమలాకర్‌, రవి పాల్గొన్నారు.

Updated Date - Feb 06 , 2025 | 01:11 AM