అన్యాక్రాంతవుతున్న మైనర్‌కాల్వలు
ABN , Publish Date - Jan 07 , 2025 | 01:14 AM
మైనర్ కాల్వలను కొందరు తమ వ్యవసాయ భూముల్లో కలుపుకోవడంతో అన్యాక్రాంతమవుతున్నాయి.

అన్యాక్రాంతవుతున్న మైనర్‌కాల్వలు
సాగునీటికి రైతుల ఇబ్బందులు
ఆందోళనకు దిగిన రైతులు
మిర్యాలగూడ రూరల్, జనవరి 6(ఆంధ్రజ్యోతి): మైనర్ కాల్వలను కొందరు తమ వ్యవసాయ భూముల్లో కలుపుకోవడంతో అన్యాక్రాంతమవుతున్నాయి. దీంతో దిగువన ఉన్న రైతుల పొలాల్లోకి అధికంగా నీరు ప్రవహిస్తుండటంతో మేజర్ వద్ద తూములను మూసివేశారు. మధ్యలో ఉన్న రైతులు నాటు వేయకుండానే కాల్వ నిలిపివేయడంతో సోమవారం ఆందోళనకు దిగారు. మండలంలోని శ్రీనివా్‌సనగర్ గ్రామం వద్ద నాటు వేసిన పొలాలకు, నాటుకు సిద్ధమైన పొలాలకు నాలుగు రోజులుగా సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిల్లాపురం మేజర్ ఆర్-1 మైనర్ కింద సుమారు 600 ఎకరాల్లో వరి సాగు చేపడుతున్నారు. ఎగువన, దిగువన ఉన్న రైతులు నాట్లు వేసుకొని సాగుకు సిద్ధమయ్యారు. మధ్యలో 200 ఎకరాలలో నాట్లు పూర్తి కాలేదు. చిల్లాపురం మేజర్ నుంచి ఆర్-1 మైనర్ ద్వారా సుమారు 6 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. దీని ద్వారా చిల్లాపురం, పొట్టెగానితండా, దుబ్బతండా, శ్రీనివా్‌సనగర్, సామ్యతండా గ్రామాలకు సంబందించిన రైతులకు సాగునీరు ఆధారం కలిగిన మైనర్ కాల్వ చివరి వ్యవసాయ భూముల వద్ద ఆక్రమణలు చేపట్టడంతో రైతుల వినియోగానికి మించిన వృథా నీరు తుంగపాడు బంధంలో కలవాల్సి ఉంది. కాగా కొందరు రైతులు కాల్వలను ఆక్రమించుకోవడంతో వృఽథా నీరు కొంతమంది వ్యవసాయ భూముల్లోకి చేరి ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చిల్లాపురం వద్ద తూమును మూసివేస్తున్నారు. ఈ క్రమంలో ఎగువన, దిగువన ఉన్న రైతుల కంటే మధ్యలో శ్రీనివా్‌సనగర్ వద్ద ఉన్న రై తులకు అవసరానికి సాగునీ రు అందకపోవడంతో తీవ్ర ఇ బ్బందులకు గురవుతున్నారు.
మైనర్ కాల్వలు మాయం
ఆర్-1 మైనర్ నుంచి రైతులకు అవసరానికి మించిన సాగునీరు కిందకు ప్రవహించి తుంగపాడు బందంలోకి వెళ్లేలా పిల్ల కాల్వలు ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం కొందరు రైతులు కాల్వలను తమ వ్యవసాయ భూముల్లో కలుపుకోవడంతో నీటి ప్రవాహం నిలిచిపోయి కొంతమంది పొలాల్లోకి చేరుతుండటంతో మేజర్ వద్ద తూములు మూసివేయడం కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతుంది. దీంతో మెరక పొలాలకు అవసరమైన సాగునీరు నిలిచిపోవడంతో నాట్లు వేసేందుకు సిద్ధమైన రైతులు, నాటు వేసిన రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
పట్టింపులేని అధికారులు
కొన్నేళ్లుగా రైతులు తమ ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేద ని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాల్వపై ఉండే సిబ్బంది, పర్యవేక్షించాల్సిన అధికారులు ఈ విషయంపై నిర్లక్ష్యం ప్రదర్శించడంతో మధ్యలో ఉన్న రైతు లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా శాశ్వత ప్రాతిపదికన అన్యాక్రాంతమైన కాల్వలను పునరుద్ధరించి సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నారు.