Share News

Suryapet: టైటాన్స్‌ స్పేస్‌ మిషన్‌-2029 వ్యోమగామి అభ్యర్థిగా మోహన్‌సాయి

ABN , Publish Date - Aug 31 , 2025 | 04:40 AM

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన ఆకుల మోహన్‌సాయి టైటాన్స్‌ స్పేస్‌ మిషన్‌-2029 వ్యోమగామి అభ్యర్థిగా ఎంపికయ్యారు.

Suryapet: టైటాన్స్‌ స్పేస్‌ మిషన్‌-2029 వ్యోమగామి అభ్యర్థిగా మోహన్‌సాయి

  • సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ వాసికి గుర్తింపు

  • అంతర్జాతీయ శాస్త్రవేత్తలతో కలిసి పనిచేసే చాన్స్‌

హుజూర్‌నగర్‌, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన ఆకుల మోహన్‌సాయి టైటాన్స్‌ స్పేస్‌ మిషన్‌-2029 వ్యోమగామి అభ్యర్థిగా ఎంపికయ్యారు. టైటాన్స్‌ స్పేస్‌ ఇండస్ట్రీస్‌ (టీఎ్‌సఐ) రెండు రోజుల క్రితం ప్రకటించిన 2029 వ్యోమగామి అభ్యర్థుల బృందంలో ఆయనకు చోటు దక్కింది. భారత్‌ నుంచి ‘ఆస్ర్టోబయోలజీ అండ్‌ స్పేస్‌ సైన్స్‌’లో పట్టభద్రులైన తొలి తరానికి చెందిన ఆయన ఈ ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ బృందంలో తెలుగు రాష్ట్రాల ప్రతినిధిగా నిలిచారు. ఆయన బెంగుళూరులోని ‘ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోస్పేస్‌ మెడిసిన్‌’లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. చంద్రుడిపై మట్టిని అనుకరించే ‘లునార్‌ సాయిల్‌ సిమ్యులెంట్స్‌’లో మొక్కల పెంపకం (సీడ్‌-టు-సీడ్‌ సైకిల్‌)పై పరిశోధనలు నిర్వహిస్తున్నారు. మోహన్‌ సాయి పోలండ్‌ (యూరప్‌), అరిజోనా (అమెరికా), లద్దాఖ్‌, రాజస్థాన్‌లో జరిగిన అంతర్జాతీయ, జాతీయ అనలాగ్‌ వ్యోమగామి మిషన్‌లలో భారత్‌ తరపున ప్రాతినిధ్యం వహించారు. గగన్‌యాన్‌ అనలాగ్‌ ప్రయోగాల్లో సేవలందించారు.


‘బతుకమ్మ’కు బ్రాండ్‌ అంబాసిడర్‌.!

హైదరాబాద్‌, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): బతుకమ్మకు బ్రాండ్‌ అంబాసిడర్‌ను నియమించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ఎవరిని నియమించాలనే అంశంపై సమాలోచనలు జరుగుతున్నాయని, త్వరలో ఒక స్పష్టత రానుందని సమాచారం. సెప్టెంబరు చివరి వారం నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం కానున్న నేపథ్యంలో త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Updated Date - Aug 31 , 2025 | 04:40 AM