Thummala: విధులకు ఆలస్యంగా హాజరైతే ఉపేక్షించం
ABN , Publish Date - Aug 29 , 2025 | 04:26 AM
ఆలస్యంగా విధులకు హాజరైతే ఉపేక్షించబోమని వ్యవసాయశాఖ, అనుబంధ కార్పొరేషన్ల అధికారులు, ఉద్యోగులను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు స్పష్టం చేశారు.
ఉదయం 10.30 గంటలకు ఆఫీసుల్లో ఉండాల్సిందే:తుమ్మల
ఆలస్యంగా విధులకు హాజరైతే ఉపేక్షించబోమని వ్యవసాయశాఖ, అనుబంధ కార్పొరేషన్ల అధికారులు, ఉద్యోగులను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు స్పష్టం చేశారు. ప్రతి రోజూ ఉదయం 10.30 గంటలకు కార్యాలయాలకు చేరుకోవాల్సిందేనన్నారు. గురువారం ఉదయం 10.40 గంటలకూ కొందరు ఉద్యోగులకు విధులకు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సకాలంలో విధులకు హాజరు కాని సిబ్బంది నుంచి వివరణ తీసుకోవాలని ఆయా విభాగాల అధిపతులను ఆదేశించిన మంత్రి తుమ్మల.. ఆలస్యంగా హాజరయ్యే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో రైతులకు ఉద్యోగులు అందుబాటులో ఉండాలని, పంటనష్టం వివరాలను సేకరించి, అంచనాలను రూపొందించాలని ఆదేశించారు.