Share News

Fraud Case: అఘోరీకి రిమాండ్‌ పొడిగింపు

ABN , Publish Date - May 03 , 2025 | 04:21 AM

పూజల పేరిట మహిళను మోసగించిన కేసులో అరెస్టయిన అఘోరీ అలియాస్‌ అల్లూరి శ్రీనివా్‌సకు విధించిన రిమాండ్‌ను న్యాయస్థానం శుక్రవారం మరో 14రోజులు పొడిగించింది.

Fraud Case: అఘోరీకి రిమాండ్‌ పొడిగింపు

శంకర్‌పల్లి, షాద్‌నగర్‌, మే 2(ఆంధ్రజ్యోతి): పూజల పేరిట మహిళను మోసగించిన కేసులో అరెస్టయిన అఘోరీ అలియాస్‌ అల్లూరి శ్రీనివా్‌సకు విధించిన రిమాండ్‌ను న్యాయస్థానం శుక్రవారం మరో 14రోజులు పొడిగించింది. అంతకముందు చేవెళ్ల కోర్టు ఆదేశాల మేరకు అఘోరీని శుక్రవారం కస్టడీలోకి తీసుకున్న మోకిల పోలీసులు నాలుగు గంటల పాటు విచారణ చేశారు.


ప్రగతి రిసార్ట్స్‌కు చెందిన మహిళ ఫిర్యాదు మేరకు అఘోరీని ప్రశ్నించారు. ఫిర్యాదు చేసిన మహిళ ఇంటికి అఘోరీని తీసుకెళ్లి వివరాలు సేకరించారు. అనంతరం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యపరీక్షలు చేయించి షాద్‌నగర్‌ కోర్టుకు తరలించారు. న్యాయమూర్తి రిమాండ్‌ను పొడిగించడంతో అఘోరీని తిరిగి చంచల్‌గూడ జైలుకి తరలించారు.

Updated Date - May 03 , 2025 | 04:21 AM