Sister Ties Rakhi To Brother: 40ఏళ్లకు అన్నకు రాఖీ
ABN , Publish Date - Aug 10 , 2025 | 03:23 AM
ఆమె మాజీ మావోయిస్టు. నలభై ఏళ్ల తర్వాత తొలిసారిగా అన్నకు రాఖీ కట్టి మురిసిపోయింది. ఆమే జగిత్యాల
కథలాపూర్, (ఆంధ్రజ్యోతి): ఆమె మాజీ మావోయిస్టు. నలభై ఏళ్ల తర్వాత తొలిసారిగా అన్నకు రాఖీ కట్టి మురిసిపోయింది. ఆమే జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండకు చెందిన పసుల వసంత. ఆమె నలభై ఏళ్లు దండకారణ్యంలో ఉన్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యురాలిగా, బస్తర్ డివిజన్ ఇన్‌చార్జిగా పనిచేశారు. అనారోగ్య సమస్యల కారణంగా ఇటీవల ఛత్తీ్‌సగఢ్‌లోని కాంకేర్‌లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. శనివారం పండుగ సందర్భంగా అన్న బత్తుల రాజంకు ఆమె రాఖీ కట్టారు. ఇక... ఛత్తీ్‌సగఢ్‌లోని సుక్మా జిల్లా ఎర్రబోరు గ్రామంలో మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోతే.. అక్కడే వారి స్మృత్యర్థం ఐదేళ్ల క్రితం విగ్రహాలు పెట్టారు. జవాన్ల విగ్రహాలకు వారి సోదరీమణులు పండుగ సందర్భంగా రాఖీ కట్టారు.