Share News

Adluri: విద్యార్థుల వసతులపై శ్రద్ధ వహించాలి: అడ్లూరి

ABN , Publish Date - Jul 15 , 2025 | 04:02 AM

విద్యార్థులకు అందించే ఆహారంతో పాటు వారికి కల్పించే వసతి విషయంలో జాగ్రత్తలు పాటించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ సూచించారు.

Adluri: విద్యార్థుల వసతులపై శ్రద్ధ వహించాలి: అడ్లూరి

హైదరాబాద్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు అందించే ఆహారంతో పాటు వారికి కల్పించే వసతి విషయంలో జాగ్రత్తలు పాటించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ సూచించారు. సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాల ప్రవేశాలు, సంక్షేమ వసతి గృహాల్లో వసతులపై ఆయా శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సోమవారం సమీక్షించారు. విద్యార్థుల ప్రవేశాల విషయంలో పారదర్శకత పాటించాలన్నారు. ఆహారం, వసతి విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - Jul 15 , 2025 | 04:02 AM