Share News

ఏటీసీలను యువత సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Sep 28 , 2025 | 12:05 AM

ఏటీసీ సేవలను యువత సద్వినియోగం చేసుకోవాలని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ సూ చించారు. శనివారం మండలంలోని కిష్టాపూర్‌లో ఏర్పాటు చేసిన అధునాతన సాంకేతిక కేంద్రం(ఏటీసీ)ని ప్రారంభించారు.

ఏటీసీలను యువత సద్వినియోగం చేసుకోవాలి
కిష్టాపూర్‌లో ఏటీసీ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌

- ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌

జన్నారం, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఏటీసీ సేవలను యువత సద్వినియోగం చేసుకోవాలని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ సూ చించారు. శనివారం మండలంలోని కిష్టాపూర్‌లో ఏర్పాటు చేసిన అధునాతన సాంకేతిక కేంద్రం(ఏటీసీ)ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటీసీలను యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. శిక్షణ పొందిన యువతకు నెలకు రెండు వేల రూపాయల స్కాలర్‌షిప్‌ అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, తహసీల్దార్‌ రాజమనోహర్‌రెడ్డి, ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్‌ బండి రాములు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ లక్ష్మీనారాయణ, మండల అధ్యక్షుడు ముజాఫర్‌ అలీ, నాయకులు ముత్యం సతీష్‌, ఇంధయ్య, రమేశ్‌ పాల్గొన్నారు.

మంచిర్యాల కలెక్టరేట్‌: రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న సాంకే తికతకు అనుగుణంగా వృత్తి విద్య కోర్సులు అందించేందుకు ప్రభుత్వం అడ్వాన్సుడ్‌ టెక్నాలజీ సెంటర్‌లను (ఏటీసీ) ఏర్పాటు చేసిందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏటీసీ సెంటర్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఐటీఐ ప్రిన్సిపల్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

మందమర్రిటౌన్‌: అడ్వాన్సుడ్‌ టెక్నాలజీ సెంటర్‌త ఉపాధి అవకా శాలు మెరుగ్గా ఉంటాయని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవా లని మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసరావు తెలిపారు. శనివారం పట్టణంలోని ఐటీఐ కళాశాలలో నూతనగా రూ. 45కోట్లతో నిర్మించిన అడ్వాన్సుడ్‌ టెక్నా లజీ సెంటర్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. అనంతరం ఏటీసీ సెంటర్‌ లను పరికరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమీషనర్‌ రాజలింగు, తహసీల్దార్‌ సతీష్‌కుమార్‌, ఐటీఐ ప్రిన్సిపల్‌ దేవానంద్‌, సిబ్బంది పాల్గొన్నారు.

నస్పూర్‌: నస్పూర్‌లోని ప్రగతి కాలనీలో నూతనంగా నిర్మించిన ఉపాధి శిక్షణ అధునాతన సాంకేతిక కేంద్రం (ఏటీసీ)ని బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌ ప్రారంభించారు. అనంతరం ఏటీసీలోని తరగతి గదులు, యంత్రాలను ఆయన పరిశీలించారు. సమావేశంలో టీజీ ఐఐసీ జోనల్‌ మేనేజర్‌ మహేశ్వర్‌, జిల్లా ఎంప్లాయిమెంట్‌ అధికారి రవిక్రిష్ణ, తహసిల్దార్‌ సంతోష్‌, శ్రీరాంపూర్‌ ఐటీఐ ప్రిన్సిపల్‌ సుజాత, ఏటీసీ ఇన్‌చార్జీ రాజామొగిలి స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 28 , 2025 | 12:05 AM