యూరియా కోసం తప్పని తిప్పలు
ABN , Publish Date - Sep 16 , 2025 | 12:57 AM
జిల్లాలో రైతులకు యూరియా తిప్పలు తప్పడంలేదు. సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సంఘానికి యూరియా బస్తాలు రావడంతో రైతులు యూరియా కోసం పెద్ద మొత్తంలో క్యూ లైన్లలో నిలుచున్నారు.
బెజ్జూరు, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రైతులకు యూరియా తిప్పలు తప్పడంలేదు. సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సంఘానికి యూరియా బస్తాలు రావడంతో రైతులు యూరియా కోసం పెద్ద మొత్తంలో క్యూ లైన్లలో నిలుచున్నారు. కౌటాల సీఐ సంతోష్, బెజ్జూరు తహసీల్దార్ రామ్మోహన్, ఎస్సై సర్తాజ్ పాషా యూరియా కేంద్రం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక్కో రైతుకు టోకెన్లు అందజేసి వరుస క్రమంలో ఒక్కొక్కరికి రెండు నుంచి మూడు బస్తాలు అందించారు.
యూరియా లారీని అడ్డుకున్న రైతులు
దహెగాం (ఆంధ్రజ్యోతి): మండలంలోని చిన్నరాస్పెల్లి గ్రామంలో సోమవారం రైతులు యూరియా బస్తాల లారీ అడ్డుకున్నారు. అనంతరం ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. గిరవెల్లి రైతు వేదిక వద్ద యూరియా బస్తాలు పంపిణీ చేయడానికి వెళ్తున్న యూరియా లారీని చిన్నరాస్పెల్లి వద్ద అడ్డుకున్నారు. ఆందోళ న చేస్తున్న రైతుల వద్దకు కాగజ్‌నగర్ రూరల్ సీఐ కుమార స్వామి, ఏవో రామక్రిష్ణ, డిప్యూటీ తహసీల్దార్ గణేష్ చేరుకొని రైతులతో మాట్లాడారు. గిరవెల్లి రైతు వేదిక వద్ద 888 యూరియా బస్తాల చొప్పున పంపిణీ చేశారు.
కెరమెరి: మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార కేంద్రం ఎదుట మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతు లు సోమవారం రాస్తారోకో చేపట్టారు. విషయం తెలుసుకు న్న ఎస్సై మధుకర్ సంఘటన స్థలానికి చేరుకొని రైతులతో చర్చించారు. సరిపడా యూరియ అందేలా చూస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన ను విరమించారు. అనంతరం పోలీస్ పహా ర మధ్య యూరియా పంపిణీ చేపట్టారు.
రైతులకు అన్నాదానం
సిర్పూర్(టి): మండలకేంద్రంలోని సహకార బ్యాంకు వద్ద వ్యవసాయ సహకా ర శాఖ ఆధ్వర్యంలో సోమవారం రైతులకు యూరియా పంపిణీ చేశారు. ఈ క్రమంలో యూరియా కోసం వచ్చిన రైతులకు సిర్పూ ర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యం లో అన్నదానం నిర్వహించారు. మాజీ సర్పంచ్ కీజర్ హుస్సేన్ పాల్గొన్నారు.