Share News

పైరవీలు లేకుండా సంక్షేమ పథకాలు

ABN , Publish Date - Jul 25 , 2025 | 11:42 PM

పేద ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ఎలాంటి పైరవీలు లేకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్‌ అన్నారు.

పైరవీలు లేకుండా సంక్షేమ పథకాలు
మాట్లాడుతున్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌

- ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌

జన్నారం, జూలై 25 (ఆంధ్రజ్యోతి): పేద ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ఎలాంటి పైరవీలు లేకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ప్రగతిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలిసి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్‌ నూతనంగా మంజూరైన రేషన్‌కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గడిచిన పదేళ్లలో రెండుసార్లు అధికారం దక్కించుకున్న బీఆర్‌ఎస్‌ పార్టీ పేదలకు రేషన్‌కార్డులు ఇచ్చిన దాఖలాలు లేవని అన్నారు. ఒక్క రేషన్‌కార్డు ఇవ్వకుండా పేదలను నిరుపేదలుగా మార్చారే తప్ప అభివృద్ది చేసిందేమిలేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్నమాట మేరకు ఇందిరమ్మ గృహాలతో పాటు ఒక జన్నారం మండలంలోని అర్హులైనవారికి 1800 రేషన్‌కార్డులను అందజేశామని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఎలాంటి పైరవీలు లేకుండా సంక్షేమ పథకాలు పేదల ప్రజలకు అందుతున్నాయన్నారు. మండలంలో ఇప్పటికే అన్ని గ్రామాల్లో మూడు కోట్ల నిధులతో సీసీ రోడ్లు నిర్మించామన్నారు.

రేషన్‌కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ:కలెక్టర్‌

రేషన్‌కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ అన్నారు. రేషన్‌కార్డు దరఖాస్తు చేసుకున్న ప్రతీ లబ్ధిదారుడికి అర్హత మేరకు రేషన్‌కార్డు లభిస్తుందని అన్నారు. రేషన్‌కార్డులతో పాటు నిరుపేద కుటుంబాలకు వచ్చే సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. కార్యక్రమం లో తహసీల్దార్‌ రాజమనోహర్‌రెడ్డి, ఎంపీడీవో ఉమర్‌ షరీఫ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దుర్గం లక్ష్మీనారాయణ, పొన్కల్‌ సహకార సంఘం చైర్మన్‌ అల్లం రవి, కాంగ్రెస్‌ నాయకులు ముజాఫర్‌ అలీ, సయ్యద్‌ ఫసీయుల్లా, మేకల మాణిక్యం, గుర్రం మోహన్‌రెడ్డి, సుభాష్‌రెడ్డి, మామిడిపెల్లి ఇంధయ్య, దుమ్మల్ల రమేశ్‌, ప్రవీణ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 25 , 2025 | 11:43 PM