Share News

రైతులను ఆదుకుంటాం

ABN , Publish Date - Aug 22 , 2025 | 12:17 AM

ప్రాణహిత నదికి వచ్చిన వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్సీ దండె విఠల్‌ అన్నారు.

రైతులను ఆదుకుంటాం
రైతులతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ దండె విఠల్‌

ఎమ్మెల్సీ దండె విఠల్‌

బెజ్జూరు, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): ప్రాణహిత నదికి వచ్చిన వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్సీ దండె విఠల్‌ అన్నారు. గురువారం మండలంలోని ప్రాణహిత తీర గ్రామాలైన తలాయి, భీమారం, తిక్కపల్లి, పాపన్నపేట, సోమిని తదితర గ్రామాల్లో నీట మునిగి నష్ట పోయిన పత్తి పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. పంట నష్ట పోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రాణహిత తీర ప్రాంతంలో నీట మునిగిన పంట నష్ట పోయిన రైతుల భూములను సర్వేలు చేసి రైతులకు నష్టం కలగకుండా చూడాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో నాయకులు గణపతి, తహసీల్దార్‌ రామ్మోహన్‌, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌, వ్యవసాయాధికారి నాగరాజు, నాయకులు శ్రీవర్ధన్‌, విశ్వేశ్వర్‌రావు, జగ్గాగౌడ్‌, రాజన్న, నాహిర్‌ అలీ, సురేష్‌గౌడ్‌, హకీం తదితరులు ఉన్నారు.

Updated Date - Aug 22 , 2025 | 12:17 AM