Share News

తంగళ్లపల్లి భూ సమస్యను పరిష్కరిస్తాం

ABN , Publish Date - Jun 18 , 2025 | 11:37 PM

మండలంలోని తంగళ్లపల్లిలో ఏళ్ల తరబడి నెలకొని ఉన్న భూ సమస్యలను పరిష్కరిస్తామని బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ అన్నారు.

తంగళ్లపల్లి భూ సమస్యను పరిష్కరిస్తాం
రైతులతో మాట్లాడుతున్న ఆర్డీవో హరికృష్ణ

- బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ

భీమిని, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తంగళ్లపల్లిలో ఏళ్ల తరబడి నెలకొని ఉన్న భూ సమస్యలను పరిష్కరిస్తామని బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ అన్నారు. గ్రామంలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో రైతులు అధికారులకు సమస్యను విన్నవించుకోగా వారు జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు బుధవారం ఆర్డీవో గ్రామస్థులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గ్రామ శివారులోని 603 ల్లో సాగులో ఉన్నప్పటికి పట్టాలు ఇవ్వడం లేదని రైతు లు పేర్కొన్నారు. పట్టాలు లేక పోవడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పంట రుణాలు అందడం లేదన్నారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆర్డీవో సూచించారు. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిం చి అర్హులైన వారందరికీ పట్టాలు అందజేస్తామని పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులకు డబ్బులు ముట్టాయని వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నా రు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. సాదాబైనా మాల కోసం చలానాలు కట్టుకోవాలన్నారు. దరఖాస్తుతో పాటు అన్ని పత్రాలు జత చేస్తే సమస్య పరిష్కరించడం సులువు అవుతుందన్నారు. రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులు, వాటి వివరాలను పూర్తిస్థాయిలో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తహసీ ల్దార్‌ బికర్ణదాస్‌, డిప్యూటీ తహసీల్దార్‌ గోవర్ధన్‌, ఆర్‌ఐ వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 18 , 2025 | 11:37 PM