పేదింటి ఆడబిడ్డల రుణం తీర్చుకుంటాం
ABN , Publish Date - Nov 18 , 2025 | 10:14 PM
పేదింటి ఆడపడుచు రుణం తీర్చుకుంటామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.
- ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
జన్నారం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): పేదింటి ఆడపడుచు రుణం తీర్చుకుంటామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మండలానికి చెందిన సుమారు 200 మంది లబ్ధిదారులకు షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామన్నారు. ప్రతీ ఇంటికి 200 యూనిట్ల విద్యుత్‌ను అందజేస్తున్నామని తెలిపారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తి స్థాయిలో పైచేయి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
- చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తాం...
రైతు పండించిన వరి పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే వెడ్మ బొజు ్జపటేల్ అన్నారు. మండలంలోని రేండ్లగూడ, మొర్రిగూడ గ్రామాలతో పాటు మండల కేంద్రంలోని మార్కెట్‌యార్డులో డీసీఎంఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజమనోహర్‌రెడ్డి, ఎంపీడీవో ఉమర్ షరీఫ్, మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ ఫసియుల్లా, మండల అధ్యక్షుడు ముజాఫర్ అలీ, నాయకులు ఇసాక్, మాణిక్యం, అల్లం రవి, దుమ్మల రమేశ్, కరుణాకర్, అజారోద్దీన్ పాల్గొన్నారు.