తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం
ABN , Publish Date - May 22 , 2025 | 11:15 PM
రైతులు అధైర్య పడొద్దని తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని డీసీవో రాథోడ్ బిక్కు రైతులకు భరోసా ఇచ్చారు. దహెగం మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీవో గురువారం పరిశీలించారు.

- డీసీవో రాథోడ్ బిక్కు
దహెగాం, మే 22 (ఆంధ్రజ్యోతి): రైతులు అధైర్య పడొద్దని తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని డీసీవో రాథోడ్ బిక్కు రైతులకు భరోసా ఇచ్చారు. దహెగం మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీవో గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఒక్క రూపాయి నష్టం జరగకుండా చూస్తామన్నారు. రైతులకు సరిపడా టార్పాలీన్లు అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. ధాన్యం తడిసి పోకుండా జాగ్రత్త పడాలని రైతులకు సూచించారు. ఆయన వెంట ఏఆర్ శామ్యూల్, పీఏసీఎస్ కార్యదర్శి నారాయణ, ఏఈవోలు వంశీ, పీపీసీ ఇన్‌చార్జి జీవన్ తదితరులు ఉన్నారు.
పెంచికలపేట: మండలంలోని ఎల్కపల్లి, ఎల్లూరు, గొంట్లపేటలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ వెంకటేశ్వరరావు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళారులను నమ్మి మోసపోవద్దని కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ఏపీఎం కోనయ్య, ఏఈఓ శ్రీవిద్య ఉన్నారు.
రైతులు ధాన్యాన్ని తీసుకురావద్దు
సిర్పూర్(టి), మే 22(ఆంధ్రజ్యోతి): మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తిగా బంద్ చేయాలని, రైతులు ధాన్యానిన తీసుకురావద్దని తహసీల్దార్ శ్రీనివాస్ సూచించారు. గురువారం మండలంలోని టోంకిని, పారిగాం, లోనవెల్లి, సిర్పూర్(టి) కొనుగోలు కేంద్రా లను తహసీల్దార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు ధాన్యంను తీసుకురావద్దన్నారు. తదుపరి ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాలను తెరవద్దన్నారు. ఏవో గిరీష్‌కుమార్, ఏపీఎం దుర్గయ్య, ఏఈవోలు నేహాతబసుం, రవికుమార్, రెవెన్యూ సిబ్బంది గోపాల్ తదితరులు ఉన్నారు.