Share News

ధన్‌ ధాన్య కృషి యోజనను సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Oct 11 , 2025 | 11:42 PM

వ్యవసాయ రంగంలో వెనుక బడిన రైతుల జీవన ప్రమాణాలు మెరుగు పర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మ కంగా అమలుచేస్తున్న ధన్‌ ధాన్య కృషి యోజనను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జైనూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడిమెత విశ్వనాథ్‌రావ్‌ సూచించారు.

ధన్‌ ధాన్య కృషి యోజనను సద్వినియోగం చేసుకోవాలి
ప్రధానమంత్రి ఉపన్యాసాన్ని వింటున్న మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విశ్వనాథ్‌రావ్‌, నాయకులు

జైనూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడిమెత విశ్వనాథ్‌రావ్‌

జైనూర్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ రంగంలో వెనుక బడిన రైతుల జీవన ప్రమాణాలు మెరుగు పర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మ కంగా అమలుచేస్తున్న ధన్‌ ధాన్య కృషి యోజనను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జైనూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడిమెత విశ్వనాథ్‌రావ్‌ సూచించారు. వర్చువ ల్‌గా ప్రధాని నరేంద్రమోది శనివారం ఇచ్చిన ఉపన్యాసాన్ని నాయకులు తిలకించారు. ఈ సందర్భంగా మార్కె ట్‌ కమిటీ చైర్మన్‌ కుడిమెత విశ్వనాథ్‌ రావ్‌ మాట్లాడుతు రైతులను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షే మ పథకాలు అమలు చేస్తున్నాయ న్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ కనక యాదవ్‌ రావ్‌, మాజీ వైస్‌ ఎంపీపీ చిర్లే లక్ష్మణ్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల ఉపాధ్యక్షుడు పెందుర్‌ ప్రకాష్‌, మాజీ డైరెక్టర్‌ కనక గంగారాం, సీనియర్‌ నాయకు లు మేస్రాం అంబాజీ, మేస్రాం గోవింద్‌రావ్‌, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Oct 11 , 2025 | 11:42 PM