విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలి
ABN , Publish Date - Sep 10 , 2025 | 11:40 PM
స్థానిక సంస్థ ల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగాలని బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరగౌడ్ పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ మల్క కొమురయ్య
మంచిర్యాల కలెక్టరేట్, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థ ల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగాలని బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరగౌడ్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సేవా పక్షం 2025 జిల్లాస్థాయి కార్య శాల సమావేశంలో వారు మాట్లాడారు. అన్ని మండలాల్లో బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, పలు సేవా కార్యక్రమాలను చేప ట్టాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. ఈ నెల 17న ప్రధాని నరేంద్రమోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని అక్టోబరు 2 వరకు అన్ని గ్రామాల్లో రక్తదాన శిబిరాలు, స్వచ్ఛ భారత్, మహిళలకు ముగ్గుల పోటీలు తదితర కార్యక్రమాలను నిర్వహించాల న్నారు. స్థానిక సంస్థల్లో బీజేపీ గెలుపే ధ్యేయంగా నాయకులు ముం దుకు సాగాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిం చాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి అశోక్, నాయకులు కృష్ణమూర్తి, వెంకటేశ్వర్‌రావు, ఏమాజీ, రమేష్, పురుషోత్తం, మల్లేష్, మల్లికార్జున్,రాకేష్ పాల్గొన్నారు.
హామీలు అమలు
చేయడంలో ప్రభుత్వం విఫలం
జైపూర్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫల మైందని బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన స్థానికసంస్థల ఎన్నికల సమా వేశానికి అతిథిగా హాజరై మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో ప్రతీ గ్రామంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమస్యలపై ప్రజ లను చైతన్యవంతులను చేయాలన్నారు. పలు గ్రామాలకు చెందిన కొంత మంది యువకులు బీజేపీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానిం చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, నాయకులు కృష్ణమూర్తి, వెంకటేశ్వర్‌రావు, దూట రాజ్‌కుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
బీజేపీలో చేరికలు
కోటపల్లి: మండలంలోని కొండంపేట గ్రామానికి చెందిన పలువు రు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తలు బుధవారం బీజేపీ మండల జన రల్ సెక్రెటరీ వడ్లకొండ రాజేష్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. మంచి ర్యాలలో జరిగిన కార్యక్రమంలో వీరికి ఉమ్మడి జిల్లా టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, జనరల్ సెక్రెటరీ దుర్గం అశోక్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల మాజీ అధ్యక్షుడు మంత్రి రామయ్య, నాయ కులు కాశెట్టి నాగేశ్వర్‌రావు, కందుల వెంకటేష్, పెద్దింటి లచ్చన్న, అడ్లూరి నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.