Share News

మా బడి మాకు కావాలి

ABN , Publish Date - Oct 06 , 2025 | 11:40 PM

కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌(టి) మండల కేంద్రంలోని గురుకులం ఎదుట కాగజ్‌నగర్‌-సిర్పూర్‌(టి) ప్రధాన రహదారిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రాస్తారోకో చేపట్టారు.

మా బడి మాకు కావాలి
రోడ్డుపై పడుకొని నిరసన తెలుపుతున్న విద్యార్థులు

- విద్యార్థులు.. తల్లిదండ్రుల ధర్నా

- కలెక్టర్‌ హామీతో విరమణ

సిర్పూర్‌(టి), అక్టోబరు 6 (ఆంద్రజ్యోతి): కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌(టి) మండల కేంద్రంలోని గురుకులం ఎదుట కాగజ్‌నగర్‌-సిర్పూర్‌(టి) ప్రధాన రహదారిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రాస్తారోకో చేపట్టారు. సిర్పూర్‌(టి) మండల కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ పాఠశాల, కళాశా ల భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవ డంతో గత ఆగస్టు నెలలో రాష్ట్ర సాంఘిక సంక్షేమాధికారి, కలెక్టర్‌ 540 మంది విద్యార్థు లను ఉమ్మడి జిల్లాలోని వివిధ గురుకులాల్లో సర్దుబాటు చేశారు. రెండు నెలలుగా చదువు కుంటున్న విద్యార్థులు అక్కడి విద్యాభ్యాసం, భోజన వసతి, ఇతర వసతులు సరిగ్గా లేవని విద్యార్థులు తల్లిదండ్రుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో సోమవా రం సిర్పూర్‌ (టి) మండల కేం ద్రంలోని గురుకులం ఎదుట కాగజ్‌నగర్‌-సిర్పూర్‌(టి) ప్రధాన రహదారిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రాస్తా రోకో చేపట్టా రు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ ఇక్కడే తాత్కాలికంగా వసతులు కల్పించి తమ పిల్లలను చదువులు చెప్పాలని డిమాం డ్‌ చేశారు. ఇతర ప్రాంతాలకు తమ పిల్లలను పంపించడంతో విద్యాభ్యాసం నాశనమవుతుం దని ఉన్నతాధికారులు వచ్చే వరకు తాము ఆందోళన విరమించబోమని పట్టుబడ్డారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ రహీము ద్దీన్‌ చేరుకుని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లాలకు సమాచారం అందించా రు. అయినా అధికారులు రావాలని విద్యార్థు లు, వారి తల్లిదండ్రులు పట్టుబట్టారు. దీంతో పోలీసులు బలవంతంగా విద్యార్థుల తల్లిదం డ్రులను పోలీసుస్టేషన్‌కు తరలించారు. తిరిగి విద్యార్థులు రోడ్డుపై పడుకోవడంతో తహసీల్దార్‌ విద్యార్థులకు నచ్చచెప్పారు. తహసీల్దార్‌ మాట్లాడుతూ కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్‌ కాగజ్‌నగర్‌ పట్టణంలో ఓ ప్రైవేటు పాఠశాల భవనంతో పాటు కౌటాల మండ లం విజయనగరంలోని సాంఘిక పాఠశాలలో విద్యార్థులను తిరిగి సర్ధుబాటు చేస్తామ ని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమ ణిగింది. విషయం తెలుసుకున్న బీఆర్‌ ఎస్‌ నాయకులు విద్యార్థుల తల్లిదండ్రు లకు మద్దతు తెలిపి ప్రభుత్వానికి వ్యతి రేకంగా నినాదాలు చేశారు. పోలీసు లు వారిని అక్కడినుంచి పంపించి వేశా రు. ఎస్సైలు సురేష్‌, సందీప్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 06 , 2025 | 11:40 PM