ఓటరు జాబితా సవరణ పకడ్బందీగా నిర్వహించాలి
ABN , Publish Date - Jul 03 , 2025 | 11:32 PM
ఓటరు జాబితా సవర ణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కాగజ్‌నగర్ సబ్‌కలెక్టర్ శ్రద్ధశుక్లా అన్నారు.
- సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లా
బెజ్జూరు, జూలై 3(ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా సవర ణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కాగజ్‌నగర్ సబ్‌కలెక్టర్ శ్రద్ధశుక్లా అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో బూత్‌స్థాయి అధికారుల శిక్షణ కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్ట ర్ మాట్లాడుతూ ఓటరు జాబితాలో నకిలీ ఓటర్లు, చనిపో యిన వారిని గుర్తించి తొలగించాలని సూచించారు. 18 ఏళ్లు పైబడిన వారిని గుర్తించి ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాల న్నారు. ఫారం 6, 7, 8 ముఖ్యమైనవని వీటిలో వివరాలను సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమం లో తహసీల్దార్ రామ్మోహన్‌రావు, డీటీ బీమ్లానాయక్, డీటీ జోగయ్య, సీనియర్ అసిస్టెంట్ సంతోష్ ఉన్నారు.
రెబ్బెన: ఓటరు నమోదు ప్రక్రియను సిబ్బంది జాగ్రత్తగా నిర్వహించాలని ఆర్డీవో లోకేశ్వర్ సూచించారు. రెబ్బెన మండల కేంద్రంలోని కేకే గార్డెన్‌లో బీఎల్‌వోలకు ఏ ర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడా రు. ఓటరు నమోదులో బీఎల్‌వోలు ఫారం నంబర్ 6, 6ఎ, 8 నింపే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సూర్య ప్రకాష్, సిబ్బంది పాల్గొన్నారు.