Share News

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి

ABN , Publish Date - Sep 01 , 2025 | 11:59 PM

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు.

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి
ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌

- ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌

ఆసిఫాబాద్‌రూరల్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణిలో భాగంగా ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని పరిష్కరించాలని సంబంధిత అఽధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా పోలీసు సేవల్ని వినియోగించుకుంటూ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు.

జిల్లాలో 30 పోలీసు యాక్టు అమలు

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 1 (ఆంద్రజ్యోతి): శాంతిభద్రతల దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ప్రశాంతా వాతావరణ పరిస్థితులను మరింత సవ్యంగా కొనసా గించడానికి సెప్టెంబరు 1 నుంచి 30 వరకు జిల్లా అంతటా 30 పోలీసు యాక్టు అమలులో ఉంటుందని ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 30 పోలీసు యాక్టు అమలులో ఉన్నందున ముంద స్తు అనుమతులు లేకుండా ఎలాంటి ప్రజా సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు నిర్వహించవద్దని సూచించారు. నిషేధిత ఆయుధాలు, దురుద్దేశంతో నేరాలకు ఉసి గొలిపే ఎటువంటి ఆయుధాలు కలిగి ఉండవద్దన్నారు. లౌడ్‌ స్పీకర్లు, డీజేలు వంటివి నిషేధమని ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.

ఎస్పీకి సన్మానం

ఆసిఫాబాద్‌రూరల్‌/జైనూర్‌ సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): గత సంవత్స రం జైనూరు మండల పరిధిలో జరిగిన సంఘటనలో ఒక మహిళపై హత్యాచారయత్నం, హత్యాయత్నం చేసిన నిందితుడికి ఆదిలాబాద్‌ ఎస్సీ, ఎస్టీ కోర్టు జీవిత ఖైదు, రూ.30 వేల జరిమానా విధించడంతో సోమవారం జైనూర్‌ మండల వాసులు ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ను మర్యాదపూర్వ కంగా కలిసి సన్మానించారు. తీర్పుతో సంతృప్తి వ్యక్తం చేస్తూ జిల్లా పోలీ సు శాఖ చేసిన కృషి మరువలేదని, నేరానికి పాల్పడిన వారికి శిక్ష తప్పద నే నమ్మకం ఈ తీర్పుతో కలిగిందని వారు అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరం చేసిన వారిని ఎవరినీ చట్టం వదిలి పెట్టదని, ఎవరైనా ఎంతటి ప్రభావం ఉన్న ఉన్నవారైనా చట్టరీత్యా తప్పక శిక్షపడుతుందన్నారు. మహిళలపై జరిగే నేరాల విషయంలో పోలీసు శాఖ కఠిన వైఖరి వలంభిస్తోందని తెలిపారు. ఇలాంటి నేరస్తులు ఎవరు శిక్ష నుంచి తప్పించుకోలేరన్నారు. కార్యక్రమంలో నాయకులు దేవేందర్‌, మోతి రాం, ఆనందరావు, భగవంతరావు, ఆనందరావు, దుందేరావు, భీంరావు, శ్యాంరావు, అర్జున్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 01 , 2025 | 11:59 PM