Share News

ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే యూరియా కొరత

ABN , Publish Date - Aug 25 , 2025 | 11:14 PM

యూరియా కొరత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమేనని ఎమ్మెల్యే కోవలక్ష్మి ఆరోపించారు. సోమవారం పీఏసీఎస్‌ కార్యాలయంలో రైతుల పక్షాన నిరసన చేపట్టారు.

ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే యూరియా కొరత
ఆసిఫాబాద్‌ పీఏసీఎస్‌ కార్యలయం ఎదుట ధర్నా చేస్తున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి

- ఎమ్మెల్యే కోవ లక్ష్మి

ఆసిఫాబాద్‌, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): యూరియా కొరత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమేనని ఎమ్మెల్యే కోవలక్ష్మి ఆరోపించారు. సోమవారం పీఏసీఎస్‌ కార్యాలయంలో రైతుల పక్షాన నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్‌రెడ్డికి కనబడడం లేదా, చెవులు వినపడడం లేదా నీకు పిరపాలన చేతకాక పోతే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో ఒక్క రైతుకు యూరియా ఇబ్బంది లేకుండా పంపిణీ చేయడం జరిగిందని, 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత బీఆర్‌ఎస్‌కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మర్సుకోల సరస్వతి, పీఏసీఎస్‌ చైర్మన్‌ అలీబీన్‌ అహ్మద్‌, రవీందర్‌, అహ్మద్‌, బలరాం, నిసార్‌, లక్ష్మణ్‌, భీమేష్‌, రాజ్‌కుమార్‌, శ్రీకాంత్‌, శ్రీను, రవి, కిట్టయ్య, మల్లయ్య, పెంటు, పోచన్న తదితరులు పాల్గొన్నారు.

తిర్యాణి/వాంకిడి/ కెరమెరి/ జైనూరు/ సిర్పూరు(యు)/ కౌటాల/ రెబ్బెన: బీఆర్‌ఎస్‌ అదిష్ఠానం పిలుపుమేరకు జిల్లాలోని తిర్యా ణి, వాంకిడి, కెరమెరి, జైనూరు, సిర్పూరు(యు), కౌటా ల, రెబ్బెన మండలాల్లో బీఆర్‌ఎస్‌ నాయకులు యూరి యా కొరతపై ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. రైతు లకు యూరియా పంపిణీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.

- రైతులకు అన్యాయం..

కాగజ్‌నగర్‌: రైతులకు యూరియా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. సోమవారం స్థానికంగా తన నివాసంలో ఏర్పాటు చేసిన ఆయన మాట్లాడారు. సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ హరీష్‌ బాబు కేంద్రంతో మా ట్లాడి యూరియాను తెప్పించాల్సి పోయి రైతుల విషయంలో నాటకాలు ఆడుతున్నారన్నారు. సిర్పూరు నుంచే తాను పోటీ చేస్తానని, ఇందుకు కేటీఆర్‌, కేసీఆర్‌లను ఒప్పించి బరిలో ఉండేందుకు కృషి చేస్తానని ప్రకటించారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ సిర్పూరు నియోజకవర్గ కన్వీనర్‌ లెండుగురే శ్యాంరావు, కొంగ సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్‌ మినాజ్‌, పార్వతి, అంజన్న, వరలక్ష్మి, కమల తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 25 , 2025 | 11:14 PM