Share News

పంచాయతీ పోలింగ్‌కు కట్టుదిట్టమైన బందోబస్తు

ABN , Publish Date - Dec 10 , 2025 | 11:25 PM

మొదటి విడత పంచాయతీ పోలింగ్‌కు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని రామగుండం పోలీసు కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.

పంచాయతీ పోలింగ్‌కు కట్టుదిట్టమైన బందోబస్తు
దండేపల్లిలో పోలీసు సిబ్బందికి సూచనలు ఇస్తున్న డీసీపీ ఎగ్గడి భాస్కర్‌

- సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా

మంచిర్యాల క్రైం, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): మొదటి విడత పంచాయతీ పోలింగ్‌కు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని రామగుండం పోలీసు కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. మంచిర్యాల జోన్‌ పరిధిలో దండేపల్లి, జన్నారం, లక్షెట్టిపేట, హాజీపూర్‌ మండలాలలో 81 గ్రామ పంచాయతీలు, 514 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయన్నారు. పోలీంగ్‌, ఎన్నికల ఫలితాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. మొదటి విడత ఎన్నికల సందర్భంగా కమిషనరేట్‌ వ్యాప్తంగా ఇద్దరు డీసీపీలు, ఆరుగురు ఏసీపీలు, 30 మంది సీఐలు, 95 మంది ఎస్సైలు, 270 మంది ఏస్సైలు, హెడ్‌ కానిస్టేబుల్స్‌, 520 మంది కానిస్టేబుల్స్‌, 240 మంది హోంగార్డులు, 170 ఆర్డ్మ్‌ సిబ్బంది, 72 క్యూఆర్‌టీ టీములు, మిగతా సిబ్బంది 200 కాగా 1600 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు అన్ని భద్రత చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద స్టైకింగ్‌, స్పెషల్‌ స్టైకింగ్‌ ఫోర్సులు సిద్దంగా ఉన్నాయని, పెట్రోలింగ్‌, మొబైల్‌ పెట్రోలింగ్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. డబ్బు, మద్యం, బహుమతుల పంపిణీ , ఓటర్లను ప్రభావితం చేసే చర్యలకు పాల్పడడం నిబందనలకు విరుద్ధమన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పౌరులు తమ ఓటు హక్కును ధైర్యంగా వినియోగించుకోవాలని సూచించారు.

ప్రశాంత వాతావరణలో ఎన్నికలను జరుపుకోవాలి: డీసీపీ

దండేపల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రజలందరు ప్రశాంత వాతావరణలో జరుపుకోవాలని మంచిర్యాల డీసీపీ ఎగ్డడి భాస్కర్‌ సూచించారు. మంగళవారం దండేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ను డీసీపీ సందర్శించి పోలీసు సిబ్బందికి ఎన్నికల నిర్వహణపై సూచనలు సలహాలు ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలను ప్రతీ ఒకరు పాటించాలన్నా రు. ఓటర్లకు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాడా నికి పోలీసు శాఖ సన్నద్ధంగా ఉందన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట మంచిర్యాల ఏసీపీ ప్రకాష్‌, సీఐ రమణమూర్తి, ఎస్సై తాహసీనోద్ధీన్‌, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Dec 10 , 2025 | 11:25 PM