పార్టీ కోసం పనిచేసిన వారికే పెద్దపీట
ABN , Publish Date - Oct 08 , 2025 | 11:24 PM
పార్టీ కోసం పనిచేసిన వారికే పెద్దపీట వేస్తామని, స్థానికసంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు.
-స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలి
-బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్
మంచిర్యాల, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): పార్టీ కోసం పనిచేసిన వారికే పెద్దపీట వేస్తామని, స్థానికసంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. బుధవారం నస్పూర్‌లోని పార్టీ కార్యాలయంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో గ్రామాల వారీగా సమీక్షించి అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. పార్టీ కోసం నిస్వార్ధంగా పనిచేసినవారికి అవకాశం కల్పిస్తామన్నారు. గ్రామస్థాయిలో ఎలాంటి గ్రూపు రాజకీయాలకు తావు లేకుండా అందరు సమష్టిగా పనిచేసి పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.