సైడ్ డ్రైనేజీలు నిర్మించాలని రాస్తారోకో
ABN , Publish Date - May 05 , 2025 | 11:57 PM
వాంకిడి మండల కేంద్రంలో నిర్మించిన నాలుగు వరుసల జాతీయ రహదారి ఇరు పక్కల సైడ్ డ్రైనేజీలు నిర్మించడంలో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు విస్మరించారని నిరసిస్తూ సోమవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు జాతీయ రహదారిపై బైఠాయించారు.
వాంకిడి, మే 5 (ఆంధ్రజ్యోతి): వాంకిడి మండల కేంద్రంలో నిర్మించిన నాలుగు వరుసల జాతీయ రహదారి ఇరు పక్కల సైడ్ డ్రైనేజీలు నిర్మించడంలో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు విస్మరించారని నిరసిస్తూ సోమవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు జాతీయ రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు ప్రశాంత్ మద్దతు తెలిపి రహదారికి ఇరుపక్కల డ్రైనేజీ నిర్మించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తూ దుర్ఘందంగా తయారవుతున్నాయన్నారు. కార్యక్రమంలో అంబేద్కర్‌నగర్ కాలనీ ప్రజలు పాల్గొన్నారు.