ఉల్లాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
ABN , Publish Date - Oct 30 , 2025 | 11:09 PM
నిరక్షరాస్యులను అక్షరాస్యులు గా తీర్చిదిద్దడం కోసం ఏర్పాటు చేసిన ఉల్లాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వయోజన విద్యాశాఖ అధికారి పురుషోత్తం సూచించారు.
జిల్లా వయోజన విద్యాశాఖ అధికారి పురుషోత్తం
వేమనపల్లి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): నిరక్షరాస్యులను అక్షరాస్యులు గా తీర్చిదిద్దడం కోసం ఏర్పాటు చేసిన ఉల్లాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వయోజన విద్యాశాఖ అధికారి పురుషోత్తం సూచించారు. గురువారం వేమనపల్లిలో వీవోఏలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని నిరక్షరాస్యులను గుర్తించాలన్నారు. వారికి చదువు నేర్పడానికి వలంటీర్లను నియమించి ఉల్లాస్ యాప్‌లో నమోదు చేయడం జరుగు తుందన్నారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతీ గ్రామ సంఘం నుంచి ఇద్దరు వలంటీ ర్స్‌ను నియమించనున్నట్లు తెలిపారు. ఈ వలంటీర్లకు శిక్షణ ఇచ్చి గ్రామ స్థాయిలో ఉల్లాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని హామీ ఇచ్చా రు. కార్యక్రమంలో ఎంపీడీవో కుమారస్వామి. ఎంఈవో శ్రీధర్‌రెడ్డి, విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ సత్యనారాయణ, సీఆర్‌పీలు తిరుమల, అమీన, డీఆర్‌పీలు సుమన్, వీవోఏలు తదితరులు పాల్గొన్నారు.