పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి
ABN , Publish Date - Jul 02 , 2025 | 11:38 PM
పాఠశాల, కళాశాల పరిస రాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు విద్యార్థులకు సూచించారు. లక్షెట్టిపేట పట్టణం లోని ప్రభుత్వ పాఠశాల, కళాశాలను డీపీవో బుధవారం పరిశీలిం చారు.
- జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు
లక్షెట్టిపేట, జూలై 2(ఆంధ్రజ్యోతి): పాఠశాల, కళాశాల పరిస రాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు విద్యార్థులకు సూచించారు. లక్షెట్టిపేట పట్టణం లోని ప్రభుత్వ పాఠశాల, కళాశాలను డీపీవో బుధవారం పరిశీలిం చారు. ఈ సందర్భంగా డీపీవో మాట్లాడుతూ పాఠశాల దేవాల యంలాంటిదని దీన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామని సీజనల్ వ్యాధులు కూడా రావన్నారు. చిత్తు కాగితాలను ఎక్కడపడితే అక్క డ పడేయకూడదని ప్రతీ తరగతి గదిలో తప్పకుండా చెత్తబుట్టను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు పాఠశాల, కళాశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనం తరం పాఠశాల మధ్యాహ్న భోజన వంటశాలను పరిశీలించి పరి శుభ్రతపై నిర్వహకులకు పలు సలహాలు సూచనలు అందజేశారు. డీపీవో వెంట ఎంపీడీవో సరోజ, ప్రిన్సిపల్ లక్ష్మణ్‌రావు, అధ్యాప కులు, ఉపాధ్యాయులు ఉన్నారు.