Share News

పోడు సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి

ABN , Publish Date - Aug 22 , 2025 | 12:15 AM

పోడు సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటన జారీ చేయాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి తెలిపారు. గురువారం సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ హరీష్‌బాబు చేస్తున్న నిరవధిక నిరహార దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు పలికి మాట్లాడారు.

పోడు సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి
దీక్షకు మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి

- పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి

కాగజ్‌నగర్‌, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): పోడు సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటన జారీ చేయాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి తెలిపారు. గురువారం సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ హరీష్‌బాబు చేస్తున్న నిరవధిక నిరహార దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు పలికి మాట్లాడారు. అటవీ శాఖ అధికారులు పోడు రైతులపై తరుచూ కేసులు పెడుతున్నారన్నారు. గత ప్రభుత్వం కూడా 40వేల ఎకరాలు పోడు రైతులకు పట్టాలిస్తామని చెప్పి కేవలం నాలుగువేల ఎకరాలకు పట్టాలిస్తామని చెప్పి చేతులు దులుపుకున్నట్టు వివరించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా అదే తరహాలో వ్యవహరిస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్‌ 49ను వెంటనే రద్దు చేయాలన్నారు. సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌ బాబు మాట్లాడుతూ ప్రజల సమస్యలపై కాంగ్రెస్‌ నాయకులకు చిత్తశుద్ధి లేదన్నారు. జిల్లాలో ఇన్‌చార్జి మంత్రి పర్యటించినా కనీసం తన దీక్ష విషయంపై స్పందించపోడం వారి చిత్తశుద్ధికి నిదర్శంగా ఉందన్నారు. సమావేశంలో మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌ గౌడ్‌, సీనియర్‌ నాయకులు కొయ్యల ఏమాజీ ముకేష్‌ గౌడ్‌, తిరుపతి, అంజనేయులు, గోవర్థన్‌, సంతోష్‌, శ్రీనివాస్‌ గౌడ్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.

క్షీణిస్తున్న ఎమ్మెల్యే ఆరోగ్యం

జీవో నంబర్‌ 49 రద్దు చేయాలని నాలుగు రోజులుగా నిరవధి నిరాహార చేస్తున్న కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌ బాబు ఆరోగ్యం క్షీణిస్తోంది. కాగజ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రి వైద్యుడు డాక్టర్‌ శ్రీధర్‌బాబు గురువారం పరీక్షలు నిర్వహించారు. కాగా ఎమ్మెల్యే షుగర్‌ లెవెల్స్‌ పడిపోవడంతో బీజేపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ కౌన్సిలర్లు సిందం శ్రీనివాస్‌, ఈర్ల విశ్వేశ్వర్‌రావు మాట్లాడుతూ సిర్పూరు ఎమ్మెల్యే హరీష్‌బాబు పరిస్థితి బాగాలేదని, రాష్ట్ర ప్రభుత్వం జీవోనంబర్‌ 49ని వెంటనే రద్దు చేయాలని డిమాండు చేశారు. శుక్రవారం కాగజ్‌నగర్‌ పట్టణ బంద్‌కు పిలుపునిస్తున్నట్టు పేర్కొన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మాజీ సర్పంచ్‌లు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - Aug 22 , 2025 | 12:15 AM